త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | క‌నీసం పంట రుణాలు కూడా ఇవ్వ‌క‌పోవ‌డం దారుణం: మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి

Niranjan Reddy | ఎల్‌నినో పేరుతో సాగునీళ్లు, కరెంటు ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వం చివరకు రుణాలు కూడా రాకుండా చేయడం దారుణమ‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 1, 2026, 5.03 pm IST

Niranjan Reddy | క‌నీసం పంట రుణాలు కూడా ఇవ్వ‌క‌పోవ‌డం దారుణం: మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర న్యూ: ఎల్‌నినో పేరుతో సాగునీళ్లు, కరెంటు ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వం చివరకు రుణాలు కూడా రాకుండా చేయడం దారుణమ‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. పాత అప్పు వడ్డీతో సహా చెల్లిస్తేనే కొత్త అప్పు ఇస్తామనడం సరికాదన్నారు. క‌రువులోనూ అన్నదాత‌ల‌పై క‌నిక‌రం చూప‌రా అని నిల‌దీశారు. ఈమేర‌కు గురువారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు పంట రుణాలు అందేలా చూడాలి. ఖరీఫ్ ముగుస్తున్నా 61 శాతం మాత్రమే రుణాలు చెల్లించడం పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. డీసీసీబీ అనుబంధ సహకార బ్యాంకుల్లోనూ రైతులకు రుణాలు ఇవ్వకుండా నెలల తరబడి కాలయాపన చేస్తుండడం సరికాదు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయడం ఎలాగూ చేతకాలేదు. కనీసం రుణాలు అయినా ఇప్పించడానికి చేతకావడం లేదా?

ప్ర‌తి ఒక్క‌రికి ఇవ్వాలి

ఎల్‌నినో పేరుతో సాగునీళ్లు, కరెంటు ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వం చివరకు రుణాలు కూడా రాకుండా చేయడం దారుణం. ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో పడి రైతులు వడ్డీలు కట్టలేక బలవుతున్నారనే కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా అంటే ఎప్పుడు ఎగ్గొడతారో.. ఎప్పుడు ఇస్తారో.. ఎంత మందికి ఇస్తారో తెలియని పరిస్థితి వచ్చింది. ద‌రఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కాలయాపన చేయకుండా పంటరుణాలు మంజూరు చేయాలి అని ఆ ప్ర‌క‌ట‌న‌లో నిరంజ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement