KTR | పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు
KTR | రాష్ట్ర ప్రజలు పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని సర్వేలన్ని చెబుతున్నయి. సరైన నాయకుడు, సరైన పార్టీని ఎన్నుకుంటేనే మనకు లాభం జరుగుతది.. ఆదమరిచి, ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు అని ఆయన అన్నారు.
KTR | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర ప్రజలు పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని సర్వేలన్ని చెబుతున్నయి. సరైన నాయకుడు, సరైన పార్టీని ఎన్నుకుంటేనే మనకు లాభం జరుగుతది.. ఆదమరిచి, ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు అని ఆయన అన్నారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సత్తూరి యాదగిరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. వారందరికీ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌తో పాటు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మోసగాళ్లనే ప్రజలు నమ్ముతారని రేవంత్‌రెడ్డి ముందే చెప్పిండు. పాత రోజులు తెస్తానని రేవంత్‌రెడ్డి చెప్పిండు. కేసీఆర్ ప్రజల తీర్పును గౌరవించి కాంగ్రెస్‌కు సమయం ఇవ్వాలని చెప్పారు. మూడేళ్లు కేసీఆర్ కనిపించకపోయినా.. గల్లీ గల్లీలో కేసీఆర్ పాటలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారు. కోదాడ, సూర్యాపేట దాకా సాగునీళ్లు ఇచ్చిన కేసీఆర్‌ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ నాట్లు వేసే సమయానికి రైతుబంధు వేసేవారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికి మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు. 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తానని చెప్పి.. చేయలేదు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు అని కేటీఆర్ మండిపడ్డారు.
అవినీతి పాలన పోవాలంటే మీ చేతుల్లోనే ఉంది
ఎవరు గెలిచినా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు అనుకున్నారు. ఎవరొచ్చినా సంక్షేమ పథకాలు బంద్ కావని ప్రజలు అనుకున్నారు. అన్న వస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రం పోతదని ముందే చెప్పినం. మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌కు గుద్దితే.. ఆ వ్యక్తి కనబడకుండా పోయిండు. ఇనుగుర్తిలో పుట్టిన ఈ ఉద్యమం.. మహబూబాబాద్ జిల్లా అంతా పాకాలి. సెప్టెంబర్ 28 నుంచి గ్రాడ్యుయేట్స్ అంతా ఓటు నమోదు చేసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీల వైఖరి ఏంటో చెప్పడానికే ఈ ఎన్నికలు. ఈ దోపిడీ, అవినీతి పాలన పోవాలంటే మీ చేతుల్లోనే ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి
- ●Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Minister Seethakka | రూ.1000 కోట్లతో 5118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క
- ●Minister Vivek | మెదక్‌లో రూ. 100 కోట్లతో పబ్లిక్ స్కూల్

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్

Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం

House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!





