త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హ‌రీశ్ లేఖ‌తో క‌దిలిన ప్ర‌భుత్వం.. అనంతగిరి, రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు

Harish Rao | కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగ‌మైన అనంత‌గిరి, రంగ‌నాయ‌క సాగ్ రిజ‌ర్వాయ‌ర్ల‌లోకి గోదావ‌రి జ‌లాల‌ను ఎత్తిపోస్తున్న‌ది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌లోని (Annapurna Pump House) 2 పంపుల ద్వారా 6,400 క్యూసెక్కుల నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి లిఫ్ట్ చేస్తున్నది.

G

Telangana | Published On Sep 26, 2026, 11.59 am IST

Harish Rao | హ‌రీశ్ లేఖ‌తో క‌దిలిన ప్ర‌భుత్వం.. అనంతగిరి, రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: గోదావ‌రిలో భారీ వ‌ర‌ద ప్ర‌వాహం ఉన్న‌ప్ప‌టికీ కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram Project) నుంచి నీటిని ఎత్తిపోయ‌డంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న‌ది, ఎల్‌నినో పేరుచెప్పి బాధ్య‌త నుంచి త‌ప్పించుకోలేరంటూ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) లేఖ రాసిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ నీటిపారుద‌ల శాఖ కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగ‌మైన అనంత‌గిరి, రంగ‌నాయ‌క సాగ్ రిజ‌ర్వాయ‌ర్ల‌లోకి గోదావ‌రి జ‌లాల‌ను ఎత్తిపోస్తున్న‌ది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌లోని (Annapurna Pump House) 2 పంపుల ద్వారా 6,400 క్యూసెక్కుల నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి లిఫ్ట్ చేస్తున్నది. ఈ రిజ‌ర్వాయ‌ర్ సామ‌ర్థ్యం 3.50 టీఎంసీలు కాగా, ప్ర‌స్తుతం 1.6 టీఎంసీ నీరు నిల్వ ఉన్న‌ది. మ‌రోవైపు రంగనాయక సాగర్‌లోకి (Ranganayaka Sagar) ఎత్తిపోత‌లు ప్రారంభ‌మ‌య్యాయి. పంప్‌హౌస్‌లోని 2 మోటార్ల ద్వారా 6,600 క్యూసెక్కుల నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నాయి.

కాగా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు కేసీఆర్‌ (KCR) కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించార‌ని, 141 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయాలు ఏర్పాటు చేశారని లేఖ‌లో పేర్కొన్నారు. వరద వచ్చినప్పుడల్లా ఆ జలాశయాలను నింపితే రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. గోదావరిలో (Godavari Water) వరద వెళ్లిపోతున్న‌ద‌ని, అయినా అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌లు డెడ్‌ స్టోరేజీలో ఉన్నాయ‌ని, మల్లన్నసాగర్‌లో 13 టీఎంసీలే ఉన్నాని తెలిపారు. మల్లన్నసాగర్‌ నిండితే హైదరాబాద్‌ (Hyderabad) తాగునీటి అవసరాలు, మూసీ ప్రాజెక్టుకు నీటిని తరలించడానికి వీలుంటుందని వెల్ల‌డించారు. రంగనాయకసాగర్‌లో జలం లేక సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్వహణ ఇబ్బందిగా మారిందని చెప్పారు. ఎల్లంపల్లి వద్ద గోదావరిలో ప్రవాహం ఉందని, ఆన్‌-ఆఫ్‌ పద్ధతిలో కాకుండా 24 గంటల పాటు ఎత్తిపోతల మోటార్లు నడిపించి జలాశయాలన్నీ నింపాల‌ని కోరారు. రాజకీయాలను పక్కనపెట్టి రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించాల‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి విన్నవించారు.

 

Advertisement
Advertisement