Ramchandar Rao | మోదీ ఎన్నిక చెల్లనప్పుడు.. రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు
Ramchandar Rao | ప్రధాని మోదీ ఎన్నిక చెల్లదని రాహుల్ అంటున్నారని.. అలాంటప్పుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఎన్నిక ఎలా చెల్లుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchandar Rao) ప్రశ్నించారు.
- కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ మహా పాదయాత్ర
- రాహుల్‌ను ప్రధాని చేస్తానని రేవంత్ పెద్ద జోక్ వేసిండు
- రాహుల్‌ను ఎదుర్కోవడానికి మన రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు చాలు
- కరీంనగర్ మహా పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఫైర్
Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: ప్రధాని మోదీ ఎన్నిక చెల్లదని రాహుల్ అంటున్నారని.. అలాంటప్పుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఎన్నిక ఎలా చెల్లుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchandar Rao) ప్రశ్నించారు. రాహుల్‌ను రేవంత్‌రెడ్డి ప్రధాని చేస్తానని చెప్పి పెద్ద జోక్ వేశాడని ఎద్దేవా చేశారు. రాహుల్‌ను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు చాలన్నారు. సర్ ప్రక్రియ జరిగి తీరుతుందని నొక్కి చెప్పారు. సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన మహా పాదయాత్రలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ మహా పాదయాత్ర చేపట్టామన్నారు.
12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుంది. ఎన్‌డీఏ ప్రభుత్వం మీద ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ దేశంలో అరాచకాన్ని సృష్టించి దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తోంది. విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. కులాలు, ప్రాంతాల పేరు మీద విభేదాలు తెచ్చి అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సర్ ప్రక్రియ గతంలో కాంగ్రెస్ హయాంలో చాలాసార్లు జరిగింది. ఇప్పుడు తొమ్మిదోసారి జరుగుతుంది. మీ హయాంలో ఇబ్బంది లేనింది.. ఇప్పుడు ఎస్ఐఆర్ పెడితే మీకు వచ్చే ఇబ్బంది ఏంది?
మోదీ ఎన్నిక చెల్లదని రాహుల్ అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు. ఆయన రాజీనామా చేస్తారా అని అడుగుతున్నా. రాహుల్‌ను ప్రధానమంత్రిని చేస్తామని రేవంత్ అంటున్నాడు. ఇంతకన్నా పెద్ద జోక్ ఉండదు. ఇది హాస్యాస్పదమైన వ్యాఖ్య. రాహుల్‌ను ఎదుర్కోవడానికి బీజేపీ నాయకులు అవసరం లేదు.. మన రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు చాలు. విదేశీ మిత్రున్ని భారత్‌కు తీసుకొచ్చి దేశాన్ని అవమనాపరుస్తున్నారు. దీన్ని సహించేది లేదు అని రాంచందర్‌రావు మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Gold Exchange | పాత బంగారం మార్చుకుంటే లక్షల రూపాయల పన్ను భారం.. ఇలా తప్పించుకోవచ్చు..
- ●CM Revanth Reddy | 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతిచ్చారు
- ●బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ ఆలయం
- ●Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?
- ●Dhuandhar Waterfall | నర్మదా నది సృష్టించే ప్రకృతి అద్భుతం.. పొగమంచులా కనువిందు చేసే 'ధువాంధర్ వాటర్‌ఫాల్' విశేషాలివే!
- ●Thalapathy Vijay | అనిరుధ్, కావ్యమారన్ రిసెప్షన్లో సీఎం విజయ్ ధరించిన సూట్ ఖరీదు ఎన్ని లక్షలంటే?

Gold Exchange | పాత బంగారం మార్చుకుంటే లక్షల రూపాయల పన్ను భారం.. ఇలా తప్పించుకోవచ్చు..

CM Revanth Reddy | 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతిచ్చారు

బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ ఆలయం

Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?





