CM Revanth Reddy | హరీశ్ మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌కు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టింది హరీశ్‌రావే అని సీఎం ఆరోపించారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌కు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టింది హరీశ్‌రావే అని సీఎం ఆరోపించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఇటీవల నేను సిద్దిపేట పర్యటనకు వెళ్లినప్పుడు కొన్ని అంశాలు ప్రస్తావించాను. 2004లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్, హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, సంతోష్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, విజయరామారావు మంత్రులుగా ఉన్నారు. ఆనాడు నాయిని నర్సింహారెడ్డి కడప ఇంచార్జిగా మంత్రిగా ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్‌కు అనుమతులు ఇచ్చారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెకులకు అనుమతి ఇచ్చారని నేను చెబితే.. జులైలో రాజీనామా చేసినం.. సెప్టెంబర్ లో జీవో వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. అయితే 2005-06 బడ్జెట్‌లో ఈ అంశం ఉంది. బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు. మంత్రివర్గం ఆమోదం లేకుండా బడ్జెట్ కేటాయింపులు జరగవు. బడ్జెట్‌లో కూడా ఆమోదించారు. అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు నిలదీయలేదు.. ఈ పాపం మీదే కదా అని సీఎం ధ్వజమెత్తారు.
కానీ ఇప్పుడు బుకాయిస్తున్నారు
వైఎస్సార్ మోచేతి నీళ్లు తాగింది మీరే కదా..? నాడు మంత్రులుగా కొనసాగి కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు. కేబినెట్ అప్రూవల్ లేకుండా రూ. 1252 కోట్లతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరికి అనుమతి ఇస్తారా..? హరీశ్‌రావుకు నిజమైన గురువు వైఎస్సార్. వైఎస్సార్ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి.. గురుదక్షిణ చెల్లింపులో భాగంగా కృష్ణా జలాలను తాకట్టు పెట్టినవ్. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీకి పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి నుంచి సప్లిమెంట్ చేయడానికి అనుమతిచ్చారు. 2020లో రాయలసీమ లిఫ్ట్‌కు అనుమతిచ్చారు. తెలంగాణ ప్రాంత నీటి హక్కులకు శాశ్వతంగా సమాధి కట్టింది కేసీఆర్, హరీశ్‌రావే. కానీ ఇప్పుడు బుకాయిస్తున్నారు అని హరీశ్‌రావుపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు.
తాజావార్తలు
- ●Gold Exchange | పాత బంగారం మార్చుకుంటే లక్షల రూపాయల పన్ను భారం.. ఇలా తప్పించుకోవచ్చు..
- ●Ramchandar Rao | మోదీ ఎన్నిక చెల్లనప్పుడు.. రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు
- ●CM Revanth Reddy | 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతిచ్చారు
- ●బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ ఆలయం
- ●Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?
- ●Dhuandhar Waterfall | నర్మదా నది సృష్టించే ప్రకృతి అద్భుతం.. పొగమంచులా కనువిందు చేసే 'ధువాంధర్ వాటర్‌ఫాల్' విశేషాలివే!

Gold Exchange | పాత బంగారం మార్చుకుంటే లక్షల రూపాయల పన్ను భారం.. ఇలా తప్పించుకోవచ్చు..

Ramchandar Rao | మోదీ ఎన్నిక చెల్లనప్పుడు.. రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు

CM Revanth Reddy | 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతిచ్చారు

బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ ఆలయం





