Jagadeesh Reddy | జెన్‌జీకి రాజకీయాలు తెలుసు.. దేశ నిర్మాణానికి వారు సిద్ధంగా ఉన్నరు
Jagadeesh Reddy | దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో జెన్ జీ మొత్తం గమనిస్తూనే ఉందని.. వారికి రాజకీయాల గురించి తెలుసని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణానికి యువత సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీ దాష్టికానికి నిరసనగా కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను పక్కన పెట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని కొనియాడారు.
- కేటీఆర్ రాజకీయ నాయకుడి కంటే ఎక్కువసార్లు మానవతావాదిగానే ఉన్నారు
- కేసీఆర్ అన్నీ గమనిస్తూనే ఉన్నడు.. ఆయన డైరెక్షన్‌లోనే మేం మాట్లాడుతున్నం
- కేసీఆర్ లాంటి కాపలా కుక్క తెలంగాణకు మరొకటి దొరకదు
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు
Jagadeesh Reddy | త్రినేత్ర.న్యూస్: దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో జెన్ జీ మొత్తం గమనిస్తూనే ఉందని.. వారికి రాజకీయాల గురించి తెలుసని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణానికి యువత సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీ దాష్టికానికి నిరసనగా కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను పక్కన పెట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని కొనియాడారు. రాజకీయ నాయకుడి కంటే మానవతావాదిగానే ఎక్కువసార్లు ఉన్నారన్నారు. ఇటీవల జరగుతున్న అన్ని పరిస్థితులకు కేసీఆర్ గమనిస్తున్నారని చెప్పారు. ఆయన డైరెక్షన్‌లోనే మేం మాట్లాడుతున్నామని వెల్లడించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ 50వ పుట్టిన రోజును పురస్కరించుకొని రెండు డాక్యుమెంటరీలు, ఒక పాటను విడుదల చేశారు.
అన్ని వర్గాల ప్రజలు కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని అనుకున్నారు. ఢిల్లీలో జరిగిన దాష్టికానికి నిరసనగా పుట్టిన రోజు వేడుకలను పక్కన పెట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ చాలా యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉన్నాడు. అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఎన్ని శాపనార్థాలు పెట్టినా కేసీఆర్, కేటీఆర్ ఆయుష్షు పెరుగుతుంది. తెలంగాణకు కేసీఆర్ లాంటి కాపలా కుక్క మరొకరు ఉండరు.
ప్రభుత్వాలు సిగ్గు పడాలి..
నీట్ పరీక్ష పేపర్ లీక్ నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది యువత నిరసన చేస్తున్నారు. దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూలిపోయింది. ఈ దేశ యువతను ఒక జడ్జి కాక్రోచ్‌లతో పోల్చారు. ఆ కాక్రోచ్‌లే తమ పోరాట పటిమను చూపిస్తున్నాయి. ప్రభుత్వాలు సిగ్గు పడాలి. మోదీ అనుకూల వాదీ రాహుల్ గాంధీ. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపకుండా మోదీ ఇంటికి వెళ్ళాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నీట్ పరీక్ష పేపర్ లీక్ పై కనీసం హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చెయ్యలేదు. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేద్దామనే రేవంత్ రెడ్డి.. రాహుల్‌కు దెబ్బ తగిలితే ఢిల్లీ ఎందుకు పోలేదు? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ కథ అయిపోయింది..
బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యుల తీరుతో బీజేపీ కథం అయిపోయింది. యువతను దేశ ద్రోహులు అంటాడా! అలా అయితే సగం మంది యువత దేశ ద్రోహులే. బీజేపీ పరువు తీసే పద్దతిలో బండి సంజయ్ మాటలు ఉన్నాయి. యువతకు మద్దతుగా రోడ్డుపై నిరసన చేయాల్సిన కాంగ్రెస్.. బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్ళింది. 10 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏ పార్టీ కార్యాలయం ముట్టడికి పోలేదు అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
పాట విడుదల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిషోర్, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, గాదరి బాలమల్లు, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!






