Gajwel | దూప అవుతుందని డ్రిప్ పైపులో నీళ్లు తాగితే.. ప్రాణం పోయింది..
Gajwel | సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) మండలం కొల్గూర్లో విషాదం చోటుచేసుకుంది. అమ్మానాన్నలతో కలిసి పొలం పనికి వెళ్లిన బాలుడు.. దూప అవుతుండంతో డ్రిప్ పైపులో (Drip Pipe) నుంచి వస్తున్న నీటిని తాగాడు.
Gajwel | త్రినేత్ర.న్యూస్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) మండలం కొల్గూర్లో విషాదం చోటుచేసుకుంది. అమ్మానాన్నలతో కలిసి పొలం పనికి వెళ్లిన బాలుడు.. దూప అవుతుండంతో డ్రిప్ పైపులో (Drip Pipe) నుంచి వస్తున్న నీటిని తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎందుకంటే ఆ డ్రిప్ పైపులో నుంచి వస్తున్ నీళ్లు నానో యూరియా (Nano Urea) కలిపినవి కావడమే.
కొల్గూర్కు చెందిన గొడుగు రాంచరణ్ (17) ఇంటీవల పదో తరగతి పూర్తిచేశాడు. ఇంటి వద్దే ఉంటుండంతో ఈ నెల 13న తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో దాహం కావడంతో పొలంలోని డ్రిప్ పైపులో నుంచి వస్తున్న నీటిని తాగాడు. అయితే ఆ పైపుల ద్వారా నానా యూరియాను కలిపిన నీటిని పంటకు సరఫరా చేస్తున్నారు. విషయం తెలియక పోవడంతో ఆ నీటిని తాగిన రాంచరణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని గజ్వేల్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషయమించడంతో మరణిచాడు. ఒక్కగానొక్క కొడుకు కండ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అవధుల్లేవు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Municipal Elections | రెండునెలల్లో మున్సిపల్ ఎన్నికలు : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
జూన్ 16, 2026

Road Accident | రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు మృతి
జూన్ 14, 2026

Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ●Motilal Oswal | టెక్స్టైల్ షేర్లపై మోతీలాల్ ఒస్వాల్ బుల్ సెంటిమెంట్.. ఈ 5 స్టాక్స్‌కు బై రేటింగ్..
- ●Rajya Sabha MPs | 31 శాతం మంది రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. రూ..5,300 కోట్ల ఆస్తితో తెలంగాణ ఎంపీ టాప్
- ●SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం
- ●Mexico vs Czechia | చెకియాపై మెక్సికో గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర, ఓచోవా అరుదైన రికార్డ్!
- ●ITR Refund | ఐటీఆర్ రీఫండ్ త్వరగా రావాలంటే ఇదే సీక్రెట్.. 7 రోజుల్లోనే డబ్బు ఖాతాలోకి..

Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Motilal Oswal | టెక్స్టైల్ షేర్లపై మోతీలాల్ ఒస్వాల్ బుల్ సెంటిమెంట్.. ఈ 5 స్టాక్స్‌కు బై రేటింగ్..

Rajya Sabha MPs | 31 శాతం మంది రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. రూ..5,300 కోట్ల ఆస్తితో తెలంగాణ ఎంపీ టాప్

SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం



