ITR Refund | ఐటీఆర్ రీఫండ్ త్వరగా రావాలంటే ఇదే సీక్రెట్.. 7 రోజుల్లోనే డబ్బు ఖాతాలోకి..
ITR Refund | ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేస్తున్న పన్ను చెల్లింపుదారులకు రీఫండ్‌లు గతంతో పోలిస్తే చాలా వేగంగా అందుతున్నాయి. ఒకప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా మంది పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో కేవలం 7 నుంచి 10 పని రోజుల వ్యవధిలోనే రీఫండ్ జమ అవుతోంది.
ITR Refund | ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేస్తున్న పన్ను చెల్లింపుదారులకు రీఫండ్‌లు గతంతో పోలిస్తే చాలా వేగంగా అందుతున్నాయి. ఒకప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా మంది పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో కేవలం 7 నుంచి 10 పని రోజుల వ్యవధిలోనే రీఫండ్ జమ అవుతోంది. అయితే కొంత క్లిష్టమైన కేసుల్లో మాత్రం రీఫండ్ రావడానికి ఒక నెల వరకు పట్టే అవకాశం ఉంటుంది. ఈ మార్పుకు ప్రధాన కారణం ఆదాయపు పన్ను శాఖ ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత ప్రాసెసింగ్ వ్యవస్థ. రిటర్న్‌ల పరిశీలన, ధ్రువీకరణ, రీఫండ్ ప్రక్రియలను ఆటోమేషన్ ద్వారా వేగవంతం చేయడంతో రీఫండ్‌ల జారీ సమయం గణనీయంగా తగ్గింది. పన్ను చెల్లింపుదారు ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేసిన తర్వాత మాత్రమే రీఫండ్ ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. ఈ-వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత సాధారణంగా 4 నుంచి 5 వారాల్లో రీఫండ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే అన్ని వివరాలు సక్రమంగా ఉంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో 7 నుంచి 10 పని దినాల్లోనే రీఫండ్ అందుతోంది.
ఇలా జరిగితే రీఫండ్ వేగంగా వస్తుంది..
ప్రస్తుతం అమల్లో ఉన్న ఆధునిక వ్యవస్థలో ఆదాయపు పన్ను శాఖ రికార్డులతో పన్ను చెల్లింపుదారు సమర్పించిన వివరాలు పూర్తిగా సరిపోతే రీఫండ్ త్వరగా ప్రాసెస్ అవుతుంది. ముఖ్యంగా ఏఐఎస్, టీడీఎస్ వివరాలు సరిపోవడం, సరైన బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వడం, సమయానికి ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయడం అత్యంత కీలకం. ప్రస్తుతం సరైన వివరాలతో ఐటీఆర్ దాఖలు చేసి, ఏఐఎస్, టీడీఎస్ డేటాను సరిపోల్చి, కచ్చితమైన బ్యాంక్ వివరాలు ఇచ్చి, వెంటనే ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసిన పన్ను చెల్లింపుదారులు 7 నుంచి 10 పని రోజుల్లోనే రీఫండ్ పొందుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏఐఎస్‌లో వ్యత్యాసాలు, క్యాపిటల్ గెయిన్స్ వివరాల్లో తప్పులు, విదేశీ ఆదాయ వివరాల వెల్లడిలో లోపాలు లేదా టీడీఎస్ క్రెడిట్‌లో అసమానతలు రీఫండ్ ఆలస్యానికి ప్రధాన కారణాలుగా కొనసాగుతున్నాయని అంటున్నారు. అంటే వ్యవస్థ వేగంగా పనిచేస్తున్నప్పటికీ, డేటా కచ్చితత్వంపై మరింత సున్నితంగా వ్యవహరిస్తోందని అర్థం. పన్ను చెల్లింపుదారు ఇచ్చిన వివరాలు, అధికారిక రికార్డుల్లో ఉన్న సమాచారం మధ్య చిన్న తేడా ఉన్నా కూడా రీఫండ్ ప్రాసెసింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.
వివరాలు సరిగ్గా లేకపోతే అంతే..
గత కొన్ని సంవత్సరాల్లో ఆదాయపు పన్ను శాఖ బ్యాక్‌ఎండ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించింది. ప్రస్తుతం ఏఐఎస్, టీఐఎస్, ఫామ్ 26ఏఎస్, ముందుగానే నింపిన రిటర్న్‌లు, ఆటోమేటెడ్ ధ్రువీకరణలు, బ్యాంకులు, యజమానులు, బ్రోకర్లు, ఇతర రిపోర్టింగ్ సంస్థల నుంచి వచ్చే రియల్ టైమ్ డేటా సమన్వయంతో మొత్తం ప్రాసెసింగ్ వ్యవస్థ పనిచేస్తోంది. ఈ సాంకేతిక ఆధారిత వ్యవస్థ వల్ల రీఫండ్‌ల జారీ వేగం గణనీయంగా పెరిగింది. 2025 మార్చి 31 నాటికి ఆదాయపు పన్ను శాఖ రూ.4.35 లక్షల కోట్లకు పైగా రీఫండ్‌లను జారీ చేయడం ఈ వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. అయితే వేగవంతమైన వ్యవస్థ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికీ వెంటనే రీఫండ్ వస్తుందని హామీ లేదు. కొన్ని ఐటీఆర్‌లు శాఖ రూపొందించిన ఆటోమేటెడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ కింద అదనపు పరిశీలనకు ఎంపిక అవుతాయి. ఆదాయం తక్కువగా చూపించడం లేదా అవసరమైన వివరాలు పూర్తిగా వెల్లడించకపోవడం వంటి అంశాలను గుర్తించేందుకు ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
ట్రాక్ చేయవచ్చు..
ఎస్‌కే పటోడియా అండ్ అసోసియేట్స్ ఎల్‌ఎల్‌పీ డైరెక్ట్ ట్యాక్స్ అసోసియేట్ డైరెక్టర్ మిహిర్ తన్నా మాట్లాడుతూ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ కింద ఐటీఆర్ ను గుర్తిస్తే రీఫండ్ వెంటనే ప్రాసెస్ కాదని చెప్పారు. పన్ను ఎగవేతకు అవకాశం ఉన్న కేసులను గుర్తించేందుకు ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నిర్దేశిత వ్యవధిలో రీఫండ్ అందకపోతే, ఐటీఆర్‌లో ఏవైనా లోపాలపై ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రీఫండ్‌కు సంబంధించిన ఈ-మెయిల్ నోటిఫికేషన్‌లు కూడా తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఒకవేళ రీఫండ్ రీ-ఇష్యూ అభ్యర్థన సమర్పిస్తే, ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ప్రకారం సాధారణంగా మరో 7 నుంచి 10 రోజుల్లో రీఫండ్ ఖాతాలో జమ అవుతుంది. అలాగే పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ రీఫండ్ స్థితిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు.
తాజావార్తలు
- ●SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం
- ●Mexico vs Czechia | చెకియాపై మెక్సికో గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర, ఓచోవా అరుదైన రికార్డ్!
- ●Cheyutha Pension | వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. దరఖాస్తులు స్వీకరించనున్న సర్కార్!
- ●PM Modi | ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి : ప్రధాని మోదీ
- ●Balakrishna | నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా - స్పెషల్ అట్రాక్షన్‌గా నందమూరి తేజస్విని
- ●South Africa vs South Korea | తొలిసారి నాకౌట్‌కు సౌతాఫ్రికా.. సౌత్ కొరియాకు భారీ షాక్!

SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం

Mexico vs Czechia | చెకియాపై మెక్సికో గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర, ఓచోవా అరుదైన రికార్డ్!

Cheyutha Pension | వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. దరఖాస్తులు స్వీకరించనున్న సర్కార్!

PM Modi | ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి : ప్రధాని మోదీ






