త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gachibowli | మంత్రి పొంగులేటి కుమారుడి మీద కేసు.. గ‌చ్చిబౌలి ఎస్ఐకి ప‌నిష్‌మెంట్‌

Gachibowli | రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హ‌ర్షా రెడ్డి మీద కేసు న‌మోదు చేసినందుకు గ‌చ్చిబౌలి ఎస్ఐ మ‌హ‌మ్మ‌ద్ హబీబుల్లా ఖాన్‌కు ప‌నిష్‌మెంట్ ట్రాన్స్‌ఫ‌ర్ క‌ల్పించారు.

S

Telangana | Published On Dec 9, 2025, 2.59 pm IST

Gachibowli | మంత్రి పొంగులేటి కుమారుడి మీద కేసు.. గ‌చ్చిబౌలి ఎస్ఐకి ప‌నిష్‌మెంట్‌
Advertisement

Gachibowli | హైద‌రాబాద్ : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హ‌ర్షా రెడ్డి మీద కేసు న‌మోదు చేసినందుకు గ‌చ్చిబౌలి ఎస్ఐ మ‌హ‌మ్మ‌ద్ హబీబుల్లా ఖాన్‌కు ప‌నిష్‌మెంట్ ట్రాన్స్‌ఫ‌ర్ క‌ల్పించారు. ఇటీవలే శిఖా గోయల్ నుండి లా అండ్ ఆర్డర్ విభాగంలో "సురక్షిత్ హైదరాబాద్" అవార్డును ఎస్ఐ మ‌హమ్మ‌ద్ హ‌బీబుల్లా ఖాన్ అందుకున్నారు. మంత్రి కొడుకు మీద కేసు పెట్టినందుకు వేకెన్సీ రిజర్వ్ పేరిట ఎస్ఐ ఖాన్‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం పనిష్‌మెంట్ ఇచ్చింది.

గ‌చ్చిబౌలి ప‌రిధిలోని వట్టినాగులపల్లిలో శ‌నివారం అర్థరాత్రి సమయంలో మంత్రి కుమారుడు 70 మంది బౌన్సర్ల బృందంతో మూడు ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న వారిపై దాడి చేసి, హద్దుల గోడలు కూల్చి వేశారు. పశువుల షెడ్‌ను ధ్వంసం చేశారు. పొంగులేటి కుటుంబానికి చెందిన కంపెనీ వట్టి నాగులపల్లిలో ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. ఆ ప్రాజెక్టు పక్కనే ఈ భూమి ఉన్నట్లు స‌మాచారం.

దాడి చేసినవారు మాఫియా గ్యాంగ్‌లా ప్రవర్తించి, భూమి హద్దుల గోడలు కూల్చి, ఆవుల షెడ్‌ను ధ్వంసం చేశారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులుకు చెప్పారు. సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి, వారిని తీవ్రంగా గాయపరిచారు. భయభ్రాంతులైన భూమి యజమానులు సైబరాబాద్ పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారని ఓ యువ పోలీస్ అధికారి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసు న‌మోదు చేశారు. స‌ద‌రు అధికారి 120 మంది పోలీసులతో స్థలానికి చేరుకుని, బౌన్సర్ల బృందాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Advertisement

తాజావార్తలు

Advertisement