త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Global summit | ఫార్మాసిటీ భూముల్లో.. ఫ్యూచర్ సిటీ చ‌ట్ట విరుద్ధం

Global summit | గ్లోబ‌ల్ స‌మ్మిట్ ( global summit) జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఫార్మా సిటీ వ్య‌తిరేక పోరాట క‌మిటీ ఫ్యూచ‌ర్ సిటీ (Pharma city and future city) నిర్మాణం చ‌ట్ట విరుద్ధ‌మని తెలిపింది

a

Telangana | Published On Dec 8, 2025, 6.34 pm IST

Global summit | ఫార్మాసిటీ భూముల్లో.. ఫ్యూచర్ సిటీ చ‌ట్ట విరుద్ధం

ఫ్యూచ‌ర్ సిటీలో సోమ‌వారం ప్రారంభ‌మైన గ్లోబ‌ల్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి, త‌దిత‌రులు

Advertisement

Global summit | హైద‌రాబాద్‌: ఫార్మాసిటీ  (Pharma city) కోసం సేక‌రించిన భూముల్లో ఫ్యూచ‌ర్ సిటీ (future city) ని క‌డ‌తామ‌ని చెప్ప‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి స‌హా ఆయ‌న‌ మంత్రులు... యాచారం మండలం రైతులకు ఫార్మా సిటీ రద్దు చేస్తామని మాట ఇచ్చి, మ్యానిఫెస్టో లో పెట్టి ఫార్మా సిటీ రద్దు చెయ్యలేద‌ని గుర్తుచేసింది. మ‌రో ప‌క్క ఇక్కడే ఫ్యూచర్ సిటీ కడతాం అంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూనే కోర్టులో మాత్రం ..తాము ఫార్మా సిటీ ని కొనసాగిస్తున్నామ‌ని అఫిడవిట్ ఇచ్చార‌ని చెప్పింది. రైతుల భూములు కాపాడుతామని ఎన్నిక‌ల ముందు మాట ఇచ్చి ఇప్పుడేమో భూములు ఇయ్యాల్సిందేన‌ని రైతుల‌ను బెదిరిస్తున్నార‌ని తెలిపింది.

ఆ నోటిఫికేష‌న్ ర‌ద్దు చేయాల్సిందే

ఫార్మా సిటీ వ్య‌తిరేక పోరాట కమిటీ ఇంకా ఏం చెప్పిందంటే... చట్ట ప్రకారం ఇక్కడ వేరే ప్రాజెక్ట్ కట్టాలంటే ఇప్పుడు ఉన్న భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చెయ్యాలి. మళ్ళీ ప్రతీ గ్రామంలో కొత్త ప్రాజెక్ట్ రిపోర్టు తెలుగులో ఇచ్చి, ప్రజా అభిప్రాయసేకరణ చెయ్యాలి. మళ్ళీ కొత్త పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాలి. ఇవేవి చెయ్యకుండా ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో మేము ఫ్యూచర్ సిటీ కడతాం అంటే అది చట్ట ప్రకారం చెల్లదు. అంతే కాదు, యాచారం మండలంలో నాలుగు గ్రామాల్లో మేడిపల్లి, నానాక్నగర్, తాటిపర్తి, కురమిద్ద లో తీసుకున్న భూములని స్వాదీనపర్చుకోకూడదని గౌరవ హై కోర్టు నుంచి స్టేలు ఉన్నాయి.కాబట్టి ఈ భూములని చూపించి ఇక్కడ మేము ఫ్యూచర్ సిటీ కడతాం అని గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ (global summit) లో ప్రపంచ దేశాల అధినేతలకి, పారిశ్రామిక సంస్థలని నమ్మిచటం ప్రభుత్వం చేస్తున్న మోసం. ఈ ప్రభుత్వం మాట ఇచ్చి మమల్ని మోసం చేసి, ఈ రోజు "ప్రజా పాలన" చేస్తున్నాం అని మీ తో ప్రగల్భాలు పలుకుతున్నారు. వీళ్ళని నమ్మి మీరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మీరు కూడా మోస పోతారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement