త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | వినాయ‌క విగ్ర‌హాల త‌ర‌లింపు.. ధూల్‌పేట‌లో 14 వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | హైద‌రాబాద్‌లోని ధూల్‌పేట ప్రాంతంలో వినాయ‌క విగ్ర‌హాల త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఇక్క‌డ్నుంచి వినాయ‌క విగ్ర‌హాల‌ను కొనుగోలు చేసి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డంతో పాటు జిల్లాల‌కు కూడా త‌ర‌లిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ధూల్‌పేట ప్రాంతానికి వాహ‌నాల రాక‌పోక‌లు పోటెత్తాయి. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 5 నుంచి వినాయ‌క చవితి(14వ తేదీ) వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

S

Hyderabad | Published On Sep 4, 2026, 10.09 pm IST

Traffic Restrictions | వినాయ‌క విగ్ర‌హాల త‌ర‌లింపు.. ధూల్‌పేట‌లో 14 వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్‌లోని ధూల్‌పేట ప్రాంతంలో వినాయ‌క విగ్ర‌హాల త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఇక్క‌డ్నుంచి వినాయ‌క విగ్ర‌హాల‌ను కొనుగోలు చేసి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డంతో పాటు జిల్లాల‌కు కూడా త‌ర‌లిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ధూల్‌పేట ప్రాంతానికి వాహ‌నాల రాక‌పోక‌లు పోటెత్తాయి. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 5 నుంచి వినాయ‌క చవితి(14వ తేదీ) వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్ష‌లు ఇలా..

  • బోయిగూడ క‌మాన్ నుంచి గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు పూర్తిగా వాహ‌నాల‌ను మ‌ళ్లించ‌నున్నారు.
  • వినాయ‌క విగ్ర‌హాల‌ను తీసుకెళ్లేందుకు ధూల్‌పేట‌కు వ‌చ్చే వాహ‌నాలు గాంధీ విగ్ర‌హం, పురానాపూల్ నుంచి లోప‌లికి ప్ర‌వేశించి.. తిరుగు ప్ర‌యాణంలో బోయిగూడ క‌మాన్ ఎక్స్ రోడ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలి.
  • పుర‌నాపూల్, గాంధీ విగ్ర‌హం నుంచి మంగ‌ళ్‌హాట్ వైపు వెళ్లే లారీలు, గ‌ణేశ్ ట్రాఫిక్‌ను ఠ‌క్క‌ర్‌వాడి టీ జంక్ష‌న్, జిన్సి చౌరాహి, గోడే కే క‌బ‌ర్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.
  • సీతారాంబాగ్ నుంచి మంగ‌ళ్‌హాట్, పురానాపూల్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను బోయిగూడ క‌మాన్ మీదుగా ఆఘాపురా, గోడే కే క‌బ‌ర్, జిన్సి చౌరాహి, ఠ‌క్క‌ర్ వాడి టీ జంక్ష‌న్, జుమ్మెర‌త్ బ‌జార్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.
  • దారుస్స‌లాం నుంచి పుర‌నాపూల్ మీదుగా మంగ‌ళ్‌హాట్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను ఆఘాపురా మీదుగా మ‌హాలక్ష్మి టిఫిన్ సెంట‌ర్, గోడే కే క‌బ‌ర్, ఠ‌క్క‌ర్ వాడి జంక్ష‌న్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

పార్కింగ్ స్థ‌లాలు ఇవే..

  • గ‌ణేశ్ విగ్ర‌హాల త‌ర‌లింపున‌కు వ‌చ్చే వాహ‌నాలను జుమ్మెర‌త్ బ‌జార్ గ్రౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలి. రాత్రి 10 త‌ర్వాత‌నే ఈ వాహ‌నాల‌ను అనుమ‌తించ‌నున్నారు.
  • పుర‌నాపూల్ వ‌ద్ద ఉన్న 100 ఫీట్ రోడ్డులో కూడా పార్కింగ్ చేసుకోవ‌చ్చు.

Advertisement
Advertisement