HJ Dora | ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత..!
HJ Dora | ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సంతాపం ప్రకటించారు.
HJ Dora | ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో మావోయిస్ట్ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలోనే ఆయన డీజీపీగా పని చేశారు. గ్రేహౌండ్స్‌ను బలోపేతం చేయడంతో పాటు నక్సలిజంపై వ్యూహాత్మక పట్టు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పోలీసుశాఖలో సాంకేతికను ప్రవేశపెట్టడం, కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరుచడంలో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి ఏపీలో ఆయన ఐదున్నరేళ్లకుగాపై డీజీపీగా పని చేశారు. సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన అధికారిగా చెబుతుంటారు.
హెచ్‌జే దొర 1965 బ్యాచ్‌కు చెందిన ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి. ఆయన 1965లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరారు. ఆయన 1943లో జన్మించారు. ఆయన స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశాక 1965లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరారు. 1989 నుంచి 1992 చివరి వరకు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా, డైరెక్టర్ జనరల్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. 1984 వరకు అనంతపురం, కరీంనగర్, కృష్ణతో సహా వివిధ జిల్లాల్లో పోలీస్ అధికారిగా పనిచేశారు . ఆ తర్వాత, ఆయన ఐదు సంవత్సరాలు పోలీసు నిఘా విభాగంలో పనిచేశారు.
ఆయన ఢిల్లీలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో విజిలెన్స్ కమిషనర్‌గా కూడా సేవలందించారు. అదనపు డీజీ ఆఫ్ పోలీస్ (CID)గా పనిచేసిన తర్వాత, 1996లో రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి పొందారు. 2002లో ఆయన న్యూఢిల్లీలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఆయన ఇండియన్ ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2006 కామన్వెల్త్ క్రీడలకు భారత బృందానికి చెఫ్-డి-మిషన్‌గా కూడా పనిచేశారు. విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీసు పతకం, పోలీస్ సేవాపతకం, పోలీస్ శౌర్య పతకాలను అందుకున్నారు.
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



