Food Safety Inspections | కంచి కేఫ్‌కు 106, ఇతిహాస్ రెస్టారెంట్‌కు 97 మార్కులు
Food Safety Inspections | సైబరాబాద్ పరిధిలోని నల్లగండ్లలోని కంచి కేఫ్ రెస్టారెంట్ (అమేయ హెరిటేజ్ ఫుడ్స్) లో, సైబరాబాద్ పరిధిలోని కేపీహెచ్‌బీ (KPHB), నెక్సస్ మాల్ సమీపంలో ఉన్న ఇతిహాస్ రెస్టారెంట్‌లో నిన్న సీఎమ్‌సీ (CMC) ఫుడ్ సేఫ్టీ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిల్వ పద్ధతులు, అక్కడ పాటిస్తున్న నిబంధనలను అధికారులు క్షుణ్నంగా పరిశీలించారు.
Food Safety Inspections | త్రినేత్ర.న్యూస్: సైబరాబాద్ పరిధిలోని నల్లగండ్లలోని కంచి కేఫ్ రెస్టారెంట్ (అమేయ హెరిటేజ్ ఫుడ్స్) లో, సైబరాబాద్ పరిధిలోని కేపీహెచ్‌బీ (KPHB), నెక్సస్ మాల్ సమీపంలో ఉన్న ఇతిహాస్ రెస్టారెంట్‌లో నిన్న సీఎమ్‌సీ (CMC) ఫుడ్ సేఫ్టీ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిల్వ పద్ధతులు, అక్కడ పాటిస్తున్న నిబంధనలను అధికారులు క్షుణ్నంగా పరిశీలించారు. ఇందులో భాగంగా కంచి కేఫ్ రెస్టారెంట్‌కు 106.. ఇతిహాస్ రెస్టారెంట్‌కు 97 మార్కులు లభించాయి. ఇతిహాస్ రెస్టారెంట్ అత్యుత్తమ ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటిస్తూ 94% స్కోరును సాధించగా కంచి కేఫ్ 92% స్కోరును ఖాతాలో వేసుకుంది. సైబరాబాద్ వ్యాప్తంగా ఈ ఆహార భద్రత తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
కంచి కేఫ్ తనిఖీల్లో తేలిన విషయాలివీ...
పాటించిన మంచి పద్ధతులు (Good Practices)
- ఆహారాన్ని తయారు చేసే సిబ్బంది హెయిర్‌నెట్స్, గ్లోవ్స్ ధరించారు
- నీటి నాణ్యత పరీక్ష నివేదికలు అందుబాటులో ఉన్నాయి
- వంటకాల్లో ఎలాంటి కృత్రిమ రంగులను (Synthetic colours) ఉపయోగించడం లేదు
- పాడైపోయిన లేదా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలేవీ కనిపించలేదు
- పురుగులు/కీటకాల వంటి ఎలాంటి పెస్ట్ సమస్యలు లేవు, కాలంచెల్లిన వస్తువులు లేవు
- క్రమంతప్పకుండా క్లీనింగ్ షెడ్యూల్‌ను పాటిస్తున్నారు
- అంతర్గత ఆడిట్ వ్యవస్థ (Internal audit) అందుబాటులో ఉంది
- స్టోర్ రూమ్‌లో ముడిసరుకులను నేలపై కాకుండా ప్యాలెట్లపై నిల్వ ఉంచారు
- కిచెన్ చిమ్నీలు క్లీన్‌గా ఉన్నాయి
బటయపడిన లోపాలు ఇలా (Violations)
- వంటగదిలో తుప్పు పట్టిన/పాడైపోయిన చాపింగ్ బోర్డులు (కూరగాయలు కోసే బోర్డులు) కనిపించాయి. వాటిని వెంటనే మార్చాలని అధికారులు ఆదేశించారు
- ఆహార సిబ్బందికి సంబంధించిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను నిర్వహించడం లేదు
- సుమారు 2 కేజీల ఇడ్లీ పిండిపై ఎలాంటి లేబులింగ్ లేకపోవడంతో అధికారులు వెంటనే పారవేయించారు
ఇతిహాస్ రెస్టారెంట్‌లో బయటపడిన వివరాలు..
పాటించిన మంచి పద్ధతులు (Good Practices)
- ఆహారాన్ని తయారుచేసే సిబ్బంది హెయిర్‌నెట్స్, గ్లోవ్స్ ధరించారు
- నీటి నాణ్యత పరీక్ష నివేదికలు, సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి
- వంటకాల్లో ఎలాంటి కృత్రిమ రంగులను లేదా అజినోమోటోను ఉపయోగించడం లేదు
- శిక్షణ పొందిన ఫోస్టాక్ (FoSTaC) సూపర్‌వైజర్లను నియమించారు
- పాడైపోయిన లేదా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలేవీ కనిపించలేదు
- రెగ్యులర్‌గా క్లీనింగ్ షెడ్యూల్‌ను పాటిస్తున్నారు
- లైసెన్స్ ఉన్న విక్రేతల నుంచే మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు, దానికి సంబంధించిన రికార్డులు సరిగ్గానే ఉన్నాయి
- వెజిటేరియన్, నాన్-వెజిటేరియన్, పచ్చి (రా) ఆహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ ఉంచారు
గుర్తించిన లోపాలు..
- వంటగది డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి 'డ్రైన్ ట్రాప్స్' (Drain traps) ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు
- ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలను రాండమ్‌గా ల్యాబ్ టెస్టింగ్‌కు పంపాలని సిఫారసు చేశారు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Divine Waste Collection Drive | దేవుళ్ల పాత ఫొటోలు ఉన్నాయా..? మాకు ఇచ్చేయండి..!
- ●SpaceX | స్పేస్ఎక్స్ కు షాక్.. 903 బిలియన్ డాలర్లు ఆవిరి.. ఐపీఓ మార్కెట్లకు భారీ దెబ్బ..
- ●Mattapalli Temple | మట్టపల్లి క్షేత్రానికి పర్యాటక శోభ.. టూరిజం అభివృద్ధి, బోటింగ్ ఏర్పాటుకు నిధుల మంజూరు..
- ●Monsoon session | పార్లమెంట్ ముందుకు వెళ్లే కీలక బిల్లులు ఇవే.. డీలిమిటేషన్‌కు దక్కని చోటు..!
- ●Road Accident | గొర్రెల వ్యాన్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. ఇద్దరు మృతి
- ●SBI Funds Management IPO | ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ అలాట్మెంట్ నేడే.. స్టేటస్ ఎలా చెక్ చేయాలి..?

Divine Waste Collection Drive | దేవుళ్ల పాత ఫొటోలు ఉన్నాయా..? మాకు ఇచ్చేయండి..!

SpaceX | స్పేస్ఎక్స్ కు షాక్.. 903 బిలియన్ డాలర్లు ఆవిరి.. ఐపీఓ మార్కెట్లకు భారీ దెబ్బ..

Mattapalli Temple | మట్టపల్లి క్షేత్రానికి పర్యాటక శోభ.. టూరిజం అభివృద్ధి, బోటింగ్ ఏర్పాటుకు నిధుల మంజూరు..

Monsoon session | పార్లమెంట్ ముందుకు వెళ్లే కీలక బిల్లులు ఇవే.. డీలిమిటేషన్‌కు దక్కని చోటు..!





