త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | జూరాల‌కు వ‌ర‌దొస్తోంది.. అయినా నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగ‌ర్ మోటార్లు ఎందుకు ఆన్ చేస్త‌లేరు?

Srinivas Goud | జూరాల ప్రాజెక్టుకు 27,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్న రాష్ట్ర ప్రభుత్వం నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ మోటార్లును ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టులో ఇప్పటికే 7.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుందన్నారు.

S

Telangana | Published On Jul 27, 2026, 2.54 pm IST

Srinivas Goud | జూరాల‌కు వ‌ర‌దొస్తోంది.. అయినా నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగ‌ర్ మోటార్లు ఎందుకు ఆన్ చేస్త‌లేరు?
Advertisement
  • వ‌ర‌దొచ్చిన‌ప్పుడు నీటిని ఎత్తిపోయాలి.. కానీ కిందికి వ‌దిలేస్తున్న‌రు
  • కాంగ్రెస్ స‌ర్కార్‌కు ఏపీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మా?
  • మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ విమ‌ర్శ‌లు

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్‌: జూరాల ప్రాజెక్టుకు 27,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్న రాష్ట్ర ప్రభుత్వం నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ మోటార్లును ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టులో ఇప్పటికే 7.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుందన్నారు. ఈరోజు సాయంత్ర‌మో లేదా రేపు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారన్నారు. అయినా పాలమూరు రైతుకు నీళ్లు అందించకుండా, ఆ నీటిని శ్రీశైలం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ పోతిరెడ్డిపాడుకు వెళ్లేలా చేయడానికే పంపులను ఆన్ చేయడం లేద‌ని ఆరోపించారు. ఈమేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

కుడి, ఎడ‌మ కాల్వ‌ల‌కు నీటిని వ‌ద‌లాలి..

ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. వరదొచ్చినప్పుడు నీటిని ఎత్తిపోయకుండా కిందికి జార విడుస్తుంది. తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమా? తక్షణమే భీమా-1లోని భూత్‌పూర్ (1.3 టీఎంసీ), సంగంబండ (3.3 టీఎంసీ), భీమా-2లోని శంకర సముద్రం (1.8 టీఎంసీ), రంగసముద్రం (1.9 టీఎంసీ), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గూడెందొడ్డి (1.2 టీఎంసీ), ర్యాలంపాడు (4 టీఎంసీ), అలాగే కోయిల్‌సాగర్ (1.5 టీఎంసీ) రిజర్వాయర్లను నింపేందుకు వెంటనే మోటార్లను ప్రారంభించాలి. జూరాల ఎడమ, కుడి కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని శ్రీ‌నివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement