త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadadri | మ‌నిషా.. ప‌శువా..? ఐదేళ్ల చిన్నారిపై మాజీ స‌ర్పంచ్ అఘాయిత్యం..!

Yadadri | అభంశుభం తెలియ‌ని ఓ చిన్నారిపై మాజీ స‌ర్పంచ్ క్రూర మృగంలా విరుచుకుప‌డ్డాడు. ఆ పాప‌కు మాయ‌మాట‌లు చెప్పి.. అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు.

S

Telangana | Published On Jan 14, 2026, 1.31 pm IST

Yadadri | మ‌నిషా.. ప‌శువా..? ఐదేళ్ల చిన్నారిపై మాజీ స‌ర్పంచ్ అఘాయిత్యం..!
Advertisement

Yadadri | త్రినేత్ర‌.న్యూస్ : అభంశుభం తెలియ‌ని ఓ చిన్నారిపై మాజీ స‌ర్పంచ్ క్రూర మృగంలా విరుచుకుప‌డ్డాడు. ఆ పాప‌కు మాయ‌మాట‌లు చెప్పి.. అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భువ‌న‌గిరి మండ‌లం పెంచ‌ల‌పాడు గ్రామంలో చోటు చేసుకుంది.

పెంచ‌ల‌పాడు గ్రామానికి చెందిన మాజీ స‌ర్పంచ్ ఎల్ల‌య్య‌.. స్థానికంగా ఉన్న ఓ ఐదేళ్ల చిన్నారిపై క‌న్నేశాడు. కామంతో ర‌గిలిపోయాడు. ఆ పాప‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా, జ‌రిగిన ఘోరం వెలుగు చూసింది. దీంతో ఎల్ల‌య్య‌ను స్థానికులు ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేసి, పోలీసుల‌కు అప్ప‌గించారు. బాధితురాలి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

చిన్నారిపై అఘాయిత్యానికి పాల్ప‌డిన మాజీ స‌ర్పంచ్‌ను బ‌హిరంగంగా ఉరి తీయాల‌ని కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్తులు డిమాండ్ చేశారు. భువ‌న‌గిరి మండ‌ల కేంద్రంలో రోడ్డుపై నిర‌స‌న చేప‌ట్టారు. త‌మ‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఇక్క‌డి నుంచి క‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని కుటుంబ స‌భ్యులు తేల్చిచెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement