త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Private Travels Bus | ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. త‌ప్పిన ప్రాణ న‌ష్టం

Private Travels Bus | సూర్యాపేట (Suryapet) జిల్లా మోతె మండ‌లం హుస్సేనాబాద్ స‌మీపంలో పెను ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. హైద‌రాబాద్ నుంచి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు (Travels Bus) మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత బోల్తాప‌డింది.

G

Telangana | Published On Sep 30, 2026, 7.55 am IST

Private Travels Bus | ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. త‌ప్పిన ప్రాణ న‌ష్టం
Advertisement

Private Travels Bus | త్రినేత్ర‌: సూర్యాపేట (Suryapet) జిల్లా మోతె మండ‌లం హుస్సేనాబాద్ స‌మీపంలో పెను ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. హైద‌రాబాద్ నుంచి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు (Travels Bus) మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత బోల్తాప‌డింది. దీంతో ఐదుగురు ప్ర‌యాణికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మైత్రీ ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు హైద‌రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో హుస్సేనాబాద్ (Hussainabad) శివారులోని పెట్రోల్ పంపు ఎదురుగా సూర్యాపేట‌- ఖ‌మ్మం హైవేపై అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌న బోల్తా ప‌డింది. ప్రమాద సమయంలో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఐదుగురు గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వారిలో ఓ మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్య‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement