త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం.. ఐదు రోజుల చిన్నారి మృతి

Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ద‌వాఖాన‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదు రోజుల చిన్నారి మృతిచెందింది. సోమ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో హాస్పిట‌ల్‌లోని న‌వ‌జాత శిశువుల (SNCU) వార్డులో ఒక్క‌సారిగా ఏసీ (AC Blast) పేలిపోయింది.

G

Telangana | Published On Sep 22, 2026, 7.08 am IST

Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం.. ఐదు రోజుల చిన్నారి మృతి
Advertisement

Adilabad RIMS | త్రినేత్ర‌.న్యూస్‌: ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ద‌వాఖాన‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదు రోజుల చిన్నారి మృతిచెందింది. సోమ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో హాస్పిట‌ల్‌లోని న‌వ‌జాత శిశువుల (SNCU) వార్డులో ఒక్క‌సారిగా ఏసీ (AC Blast) పేలిపోయింది. దీంతో భారీగా మంట‌లు చెల‌రేగి వార్డంతా పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని బయటకు పరుగెత్తారు. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది ఆ వార్డుకు విద్యుత్తు సరఫరా నిలిపి వేశారు. అందులోని పిల్లలను పక్క వార్డుకు తరలించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ద‌వాఖాన‌కు చేరుకుని మంట‌లు అదుపుచేశారు. ప్ర‌మాద స‌మ‌యంలో 27 మంది పిల్లలు ఉన్నారు. వారంద‌రిని ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు తరలించారు. వారిలోలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతిచెందిన శిశువు ఇచ్చోడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ (Short Circuit) వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు.

కాగా, ద‌వాఖాన‌ను జిల్లా క‌లెక్ట‌ర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ సంద‌ర్శించారు. ఘటనకు గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గాయ‌ప‌డిన‌ చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Advertisement
Advertisement