Fire Accident | కేర్‌లెస్ స్మోకింగ్ వల్లే అగ్నిప్రమాదాలు.. 4 నెలల్లోనే 3,858 అగ్నిప్రమాదాలు
Fire Accident | రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట అగ్నిప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ అగ్నిప్రమాదాలు కేర్‌లెస్ స్మోకింగ్, ఎక్కడంటే అక్కడ కాల్చిన సిగరెట్‌ను పడేయడం వల్లే జరుగుతున్నట్లు అగ్నిప్రమాద శాఖ పరిశీలనలో తేలింది.
Fire Accident | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట అగ్నిప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ అగ్నిప్రమాదాలు కేర్‌లెస్ స్మోకింగ్, ఎక్కడంటే అక్కడ కాల్చిన సిగరెట్‌ను పడేయడం వల్లే జరుగుతున్నట్లు అగ్నిప్రమాద శాఖ పరిశీలనలో తేలింది. 2026లో ఇప్పటి వరకు అగ్నిప్రమాదాలకు సంబంధించి 1,915 కేసులు నమోదైనట్లు పేర్కొంది.
ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,858 అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 3,447 చిన్న అగ్నిప్రమాదాలు, 106 మీడియం, 27 సీరియస్, 14 మేజర్ అగ్నిప్రమాదాలు జరిగినట్లు తేలింది. ఇందులో విద్యుత్ లోపాల వల్ల 871 అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
ఈ అగ్నిప్రమాదాల్లో 60 ఘటనల వరకు ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకున్నవే ఉన్నాయి. వ్యర్థాలను కాల్చడం ద్వారా 21, గ్యాస్ సంబంధిత సమస్యలతో 69, మెకానికల్ సమస్యల వల్ల 89 అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
రూ. 2,76,887 కోట్ల ఆస్తి నష్టం
ఈ అగ్నిప్రమాదాల వల్ల సుమారు రూ. 2,76,887 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవడం వల్ల రూ. 5,35,460 కోట్ల విలువైన ఆస్తులను కాపాడగలిగినట్లు నివేదికలో తేలింది.
మృతులు 14
ఏప్రిల్ 28వ తేదీ వరకు చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 67 మందిని ప్రాణాలతో రక్షించారు. అగ్నిప్రమాదాలు చోటు చేసుకోని కేసుల్లో 161 మంది ప్రాణాలు కోల్పోగా, 49 మందిని రక్షించారు.
అత్యధికంగా నివాస ప్రాంగణాల్లోనే..
అత్యధికంగా నివాస సముదాయాల్లో 987 అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఇతర ప్రాంతాల్లో 539, వ్యవసాయ భూముల్లో 534, రైలు, షాప్స్, ఆఫీసులు, విద్యాసంస్థలు, పారిశ్రామిక వాడల్లో 207 అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




