త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oil palm plantation destroyed in fire | తిరుమ‌ల‌గిరిలో అగ్ని ప్ర‌మాదం.. 8 ఎక‌రాల పామాయిల్ తోట ద‌గ్ధం

Oil palm plantation destroyed in fire | యశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కట్ల మధుసూదన్ రెడ్డికి చెందిన 8 ఎకరాల పామాయిల్ తోట పూర్తిగా మంట‌ల్లో కాలిపోయింది.

S

Telangana | Published On May 28, 2026, 12.33 pm IST

Oil palm plantation destroyed in fire | తిరుమ‌ల‌గిరిలో అగ్ని ప్ర‌మాదం.. 8 ఎక‌రాల పామాయిల్ తోట ద‌గ్ధం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పు పెట్ట‌గా మంట‌లు వ్యాపించాయి. పక్కనే ఉన్న పామాయిల్ తోటకు అంటుకోగా ఈ ప్రమాదంలో రైతు కట్ల మధుసూదన్ రెడ్డికి చెందిన 8 ఎకరాల పామాయిల్ తోట పూర్తిగా మంట‌ల్లో కాలిపోయింది.

పామాయిల్ తోటలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, మోటర్లు కూడా మంట‌ల్లో కాలి బూడిద‌య్యాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement