Food | బరువు తగ్గాలని భోజనం మానేస్తున్నారా.. అలా చేయొద్దంటున్న వైద్యులు..
Food | బరువు తగ్గాలని అనుకునే చాలా మంది ముందుగా చేసే పని భోజనం తగ్గించడం. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ మానేస్తే త్వరగా ఫ్యాట్ కరుగుతుందని భావిస్తుంటారు. కానీ ఈ విధానం శరీరానికి మేలు చేయకపోవడంతోపాటు, వెయిట్ లాస్ ప్రయాణాన్ని మరింత మందగింపజేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Food | బరువు తగ్గాలని అనుకునే చాలా మంది ముందుగా చేసే పని భోజనం తగ్గించడం. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ మానేస్తే త్వరగా ఫ్యాట్ కరుగుతుందని భావిస్తుంటారు. కానీ ఈ విధానం శరీరానికి మేలు చేయకపోవడంతోపాటు, వెయిట్ లాస్ ప్రయాణాన్ని మరింత మందగింపజేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీఎల్సీసీ హెల్త్‌కేర్ కి చెందిన ప్రివెంటివ్ హెల్త్ విభాగం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అంజు ఘెయ్ మాట్లాడుతూ, భోజనం మానేయడం వల్ల బరువు తగ్గడం కంటే ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు. తక్కువ తినడం అంటే భోజనం పూర్తిగా స్కిప్ చేయడం కాదని ఆమె స్పష్టం చేశారు. చాలామంది తక్కువసార్లు తింటే తక్కువ క్యాలరీలు తీసుకుంటాం, అందువల్ల బరువు తగ్గుతామని అనుకుంటారని, కానీ శరీరం అంత సింపుల్‌గా పనిచేయదని ఆమె వివరించారు. శరీరంలో ఎనర్జీ వినియోగం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని చెప్పారు. అందుకే యాదృచ్ఛికంగా భోజనం మానేయడం, పద్ధతిగా ఫాస్టింగ్ చేయడం మధ్య తేడా తెలుసుకోవాలని సూచించారు.
భోజనం మానేస్తే ఏమవుతుంది..?
ఒకపూట భోజనం మానేస్తే శరీరం వెంటనే ఫ్యాట్ బర్నింగ్ మోడ్ లోకి వెళ్తుందని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి శరీరం అలా స్పందించదు. భోజనం క్రమం తప్పితే శరీరం దానిని ఎనర్జీ కొరతగా భావించి, శక్తిని ఆదా చేసే విధంగా స్పందించడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో శరీరంలో మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. అంటే రోజంతా శరీరం తక్కువ క్యాలరీలను మాత్రమే ఖర్చు చేస్తుంది. అదే సమయంలో కార్టిసోల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు పెరిగి, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశాన్ని పెంచుతాయి. ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది. భోజనం క్రమం తప్పితే ఆకలిని నియంత్రించే గ్రెలిన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని డాక్టర్ చెప్పారు. ఫలితంగా రోజులో తర్వాత ఎక్కువ ఆకలి వేసి, అధికంగా తినడం లేదా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే క్విక్ ఎనర్జీ ఫుడ్స్ వైపు ఆకర్షితులు అవుతారని వివరించారు. అంతేకాదు, భోజనం మానేయడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు కూడా అస్థిరంగా మారే అవకాశం ఉందన్నారు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచి, ప్రీడయాబెటిస్ లేదా మెటబాలిక్ సమస్యలు ఉన్నవారిలో మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ప్రోటీన్ తీసుకోవడం తగ్గితే, ముఖ్యంగా 40 ఏళ్లు దాటినవారిలో శరీరం ఎనర్జీ కోసం మజిల్స్‌ను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. దీని వల్ల వెయిట్ లాస్ ప్రక్రియ మరింత నెమ్మదిస్తుంది.
సరైన ఫాస్టింగ్ ఎలా చేయాలి..?
యాదృచ్ఛికంగా భోజనం మానేయడం బదులు, పద్ధతిగా ఫాస్టింగ్ చేయాలని డాక్టర్ సూచించారు. రాత్రి 12 నుంచి 14 గంటల వరకు ఫాస్టింగ్ చేయడం లేదా 8 నుంచి 10 గంటల ఈటింగ్ విండోలో మాత్రమే ఆహారం తీసుకునే టైమ్-రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ విధానం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గి, శరీరం నిల్వలో ఉన్న కొవ్వును ఎనర్జీగా ఉపయోగించే అవకాశం పెరుగుతుందని వివరించారు. కాబట్టి నియంత్రిత ఫాస్టింగ్, యాదృచ్ఛికంగా భోజనం మానేయడంకంటే ఆరోగ్యకరమైనదని చెప్పారు. రోజుకు రెండు లేదా మూడు భోజనాలు 4 నుంచి 5 గంటల వ్యవధిలో తీసుకోవడం మంచిదని సూచించారు. అయితే మధ్య మధ్యలో నిరంతరం స్నాక్స్ తినడం తగ్గించాలని చెప్పారు. ప్రతి భోజనంలో గుడ్లు, పప్పులు, పనీర్ వంటి ప్రోటీన్ ఫుడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, మిల్లెట్స్ వంటి హోల్ గ్రెయిన్స్, అలాగే నట్స్ లేదా అవకాడో వంటి హెల్తీ ఫ్యాట్స్ ఉండాలని సూచించారు. ఈ విధమైన ఆహారం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటంతోపాటు, బ్లడ్ షుగర్ స్థిరంగా ఉండి, మజిల్ మాస్ కూడా సురక్షితంగా ఉంటుందని చెప్పారు.
ఎక్కువసేపు ఫాస్టింగ్ చేస్తే ప్రమాదమే..
వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎక్కువసేపు ఫాస్టింగ్ చేయడం ప్రమాదకరమని డాక్టర్ అంజు ఘెయ్ చెప్పారు. దీని వల్ల గ్లైకోజెన్ నిల్వలు తగ్గిపోయి అలసట, తలనిర్భంధం, పోషకాహార లోపాలు, మెటబాలిజం మందగించడం వంటి సమస్యలు వస్తాయన్నారు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ డైట్స్ వల్ల తర్వాత మళ్లీ సాధారణ ఆహారం తీసుకోవడం ప్రారంభించినప్పుడు వేగంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Reliance AGM | రిలయన్స్ ఏజీఎం తేదీ ఫిక్స్.. అందరి చూపు జియో ఐపీఓపైనే..
- ●Gandhi IVF Centre | గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో 'బాలభీముడు'
- ●India Student | కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచి
- ●Ghoshamahal Police | మానవత్వంతో స్పందించారు.. దివ్యాంగురాలిని రక్షించి అప్పగించారు..
- ●CBSE OSM controversy | నేను బాధ్యత వహిస్తున్నా.. సీబీఎస్ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ వివాదంపై కేంద్ర మంత్రి
- ●Meta | పెయిడ్ ప్లాన్లను ప్రకటించిన మెటా.. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ప్రీమియం ఫీచర్లు..

Reliance AGM | రిలయన్స్ ఏజీఎం తేదీ ఫిక్స్.. అందరి చూపు జియో ఐపీఓపైనే..

Gandhi IVF Centre | గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో 'బాలభీముడు'

India Student | కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచి

Ghoshamahal Police | మానవత్వంతో స్పందించారు.. దివ్యాంగురాలిని రక్షించి అప్పగించారు..






