త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi IVF Centre | గాంధీ ఐవీఎఫ్ సెంట‌ర్‌లో ‘బాల‌భీముడు’

Gandhi IVF Centre | హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలోని ఐవీఎఫ్ సెంట‌ర్‌లో సుమారు 4 కిలోల బ‌రువుతో బాలుడు జ‌న్మించాడు. పండంటి ఆ మ‌గ‌బిడ్డ‌ను చూసి త‌ల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు.

S

Hyderabad | Published On May 28, 2026, 2.27 pm IST

Gandhi IVF Centre | గాంధీ ఐవీఎఫ్ సెంట‌ర్‌లో ‘బాల‌భీముడు’
Advertisement

Gandhi IVF Centre | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలోని ఐవీఎఫ్ సెంట‌ర్‌లో సుమారు 4 కిలోల బ‌రువుతో బాలుడు జ‌న్మించాడు. పండంటి ఆ మ‌గ‌బిడ్డ‌ను చూసి త‌ల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు.

భువ‌న‌గిరి జిల్లాకు చెందిన ర‌వి, సౌమ్య దంప‌తుల‌కు 9 ఏళ్ల క్రితం వివాహం జ‌రిగింది. సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డంతో.. పలు ప్రైవేటు ఫెర్టిలిటీ సెంటర్లలో చికిత్స తీసుకున్నారు. సుమారు 12 సార్లు ఓఐ, ఐయూఐ వంటి ప్రొసీజర్లు చేయించుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. గతేడాది గాంధీ హాస్పిటల్‌లోని ఐవీఎఫ్ సెంటర్‌ను రవి, సౌమ్య దంపతులు ఆశ్రయించారు.

ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల జీవితాల్లో గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు వెలుగులు నింపారు. ఐవీఎఫ్ తొలి ప్ర‌య‌త్నంలోనే సౌమ్య ప్రెగ్నెన్సీ స‌క్సెస్ అయిన‌ట్లు డాక్ట‌ర్లు శోభ‌, ఫాతిమా తెలిపారు. ఐవీఎఫ్ మొదలు యాంటినాటల్ చెకప్స్, మెడిసిన్ అన్నీ గాంధీలోనే ఉచితంగా అందజేశామని వివరించారు.

ఈ నెల 27న గాంధీ హాస్పిటల్‌లోనే సౌమ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 3.6 కిలోల బరువుతో బాబు, తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. సౌమ్య, రవి దంపతులు ప్రైవేటు హాస్పిటల్స్‌లో లక్షలు ఖర్చు చేసుకున్నారని, గాంధీలో పూర్తి ఉచితంగా వారికి చికిత్స అందించామని సూపరింటెండెంట్, డాక్టర్ వాణి తెలిపారు.

Advertisement
Advertisement