Jatayu | సీతమ్మను ఎత్తుకెళ్తుండగా.. రావణుడితో పోరాడి జటాయువు ప్రాణాలు విడిచింది ఇక్కడే..!
Jatayu | భారతీయ ఇతిహాసం రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన 'రామాయణం: పార్ట్ 1' (Ramayana: Part 1) సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలలో ఒకటి జటాయువు (Jatayu).
Jatayu | త్రినేత్ర న్యూస్: భారతీయ ఇతిహాసం రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన 'రామాయణం: పార్ట్ 1' (Ramayana: Part 1) సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలలో ఒకటి జటాయువు (Jatayu). ఇప్పుడు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పేరుతో ఉన్న కేరళలోని ఒక గ్రామం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జటాయువు గురించి ఆ రాష్ట్ర సీఎం వీడీ సతీశన్ (VD Satheesan).. `వెండితెర నుంచి జటాయువు నేల వరకు` అంటూ సామాజిక మాధ్యామల్లో చేసిన ఓ పోస్టు చర్చనీయాంశమైంది.
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన సాయిపల్లవి సీతమ్మ పాత్రలో, రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన ఈ సినిమాకు.. కేరళలోని కొల్లాం జిల్లా చదయమంగళం (Chadayamangalam) లోని 'జటాయు ఎర్త్స్ సెంటర్'లో ఉన్న భారీ పక్షి విగ్రహానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. చదయమంగళంలోని జటాయు ఎర్త్ సెంటర్‌లో (Jatayu Earth's Centre) ఉన్న జటాయువు విగ్రహాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పంగా అభివర్ణిస్తారు. 'రామాయణం' చిత్రం జటాయువు పట్ల గౌరవాన్ని మళ్లీ పెంచిందన్నారు. సత్యాన్ని, ఒక మహిళ గౌరవాన్ని కాపాడటానికి జటాయువు చేసిన `అద్భుతమైన త్యాగం మరువలేనిది` అని కొనియాడుతూ, జటాయుపార వద్ద ఆ చరిత్రను ప్రత్యక్షంగా వీక్షించాలని ఆయన ప్రజలను ఆహ్వానించారు.
From the Silver Screen to the Land of Jatayu
The newly released Ramayana has rekindled admiration across India for Jatayu, whose legendary sacrifice to defend truth and a woman's honour remains unforgettable.
It is a moment of pride that millions are now discovering this legend lives on in Keralam. At Chadayamangalam, Jatayu Earth's Center stands as home to the world's largest bird sculpture, inspired by this timeless symbol of courage and sacrifice.
My heartfelt thanks to our tourism teams and everyone whose vision made this magnificent landmark possible. Having watched the legend on screen, I invite everyone across India to experience it in person at Jatayupara.
Welcome to God's Own Country!
@KeralaTourism
@WorldOfRamayana#Ramayana #VDSatheesan
— V D Satheesan (@vdsatheesan) November 9, 2026
ఈ నెల 12న జటాయువు ఎర్త్స్ సెంటర్‌ను సందర్శించిన బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా (Shehzad Poonawalla) కూడా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశారు. సీతమ్మను రక్షించడానికి జటాయువు చేసిన ప్రయత్నానికి, ధైర్యానికి ఈ శిల్పం ఒక నివాళి అని అభివర్ణించారు. `ఇది ఒక సాధారణ పక్షి విగ్రహం కాదు. శ్రీరామచంద్రుని (Lord Rama) ఈ గొప్ప భక్తుని ధైర్యసాహసాలు, పరాక్రమం, నిబద్ధతకు, ఒక రకంగా చెప్పాలంటే మహిళల హక్కుల కోసం చేసిన పోరాటానికి నివాళి అర్పించే విగ్రహం` అని పేర్కొన్నారు. కొండపై ఉన్న విగ్రహంతో పాటు, ఈ పురాణ గాథతో ముడిపడి ఉన్న ఒక కొలనును, శ్రీరాముని పాదముద్రగా విశ్వసించే ఒక గుర్తును కూడా తన వీడియోలో చూపించారు.
While i haven’t seen the Ranbir Kapoor movie Ramayana yet- let us take a look at the inspiring story of Jatayu Maharaj
“He fought not for victory, but for what was right.”
The Epitome of Courage, Sacrifice and Dharma
https://t.co/LL1Q8Et961 https://t.co/KGAHPV7eZT
— Shehzad Jai Hind (@Shehzad_Ind) November 12, 2026
చడయమంగళమే ఎందుకు..?
రావణుడు రెక్కలు నరికిన తర్వాత జటాయువు ఇక్కడి ఒక రాతి కొండపై పడిపోయాడని స్థానికులు నమ్ముతారు. ఈ కొండను `జటాయుపాఱ` (జటాయువు రాయి) అని పిలుస్తారు. గతంలో 'జటాయుమంగళం` (Jatayumangalam) అని పిలిచేవారని స్థానిక జానపద కథనాలు చెబుతున్నాయి. జటాయుపాఱ వద్ద ఉన్న శ్రీ కోదండరామ ఆలయానికి సంబంధించి చడయమంగళం గ్రామ పంచాయతీ కథనం ప్రకారం.. `సీతను రక్షించే ప్రయత్నంలో రావణుడు జటాయువు రెక్కలు నరికినప్పుడు ఆ పక్షి ఈ రాతి కొండపై పడిపోయింది. తన తుది శ్వాస విడిచే ముందు జటాయువు, సీతాపహరణ గురించి రాముడు, లక్ష్మణులకు వివరించాడు`.

ప్రాణాలు విడుస్తున్న జటాయువును రాముడు తన చేతుల్లోకి తీసుకుని, మోక్షం ప్రసాదించి, ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ కొండపై ఉన్న ఒక పాదముద్రను సంప్రదాయబద్ధంగా శ్రీరాముడి పాదముద్రగా భావిస్తారు. జటాయువు పడిపోయిన కచ్చితమైన ప్రదేశంలోనే శ్రీ కోదండరామ ఆలయం ఉంది. ఇక్కడ శ్రీరాముడు విల్లు ధరించిన రూపంలో కోదండరాముడిగా (Kodandarama) పూజలు అందుకుంటున్నాడు.
కాగా, చడయమంగళం, జటాయువు మధ్య ఉన్న ఈ అనుబంధం ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందకముందే ఉంది. ఈ కొండను సంప్రదాయబద్ధంగా జటాయుపాఱ అని పిలుస్తారు. ఈ స్థానిక గాథ ఈ ప్రాంతపు మతపరమైన, సాంస్కృతిక గుర్తింపులో భాగమైపోయింది. రావణుడితో యుద్ధం తర్వాత జటాయువు పడిపోయిన ప్రదేశంగా ఈ కొండను కేరళ పర్యాటక శాఖ కూడా గుర్తించింది.
చదయమంగళం ఒక్కటే కాదు..
రావణుడితో వీరోచితంగా పోరాడిన తర్వాత జటాయువు నేలకొరిగిన ప్రదేశం ఇదేనని చెప్పుకుంటున్న ప్రాంతం చదయమంగళం ఒక్కటే కాదు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో కూడా ఈ ఘట్టానికి సంబంధించిన కథలు వాడుకలో ఉన్నాయి. జటాయువు కింద పడిపోవడం, మరణించడం, రాముడు అంత్యక్రియలు నిర్వహించడం వంటి అంశాలతో ఈ ప్రదేశాలు ముడిపడి ఉన్నాయి.

లేపాక్షి: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి (Lepakshi) మరో ప్రముఖ క్షేత్రం. స్థానిక కథనాల ప్రకారం, గాయపడిన జటాయువును చూసిన రాముడు `లే పక్షి` అని పిలిచాడు. దీంతో ఆ గ్రామానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రచురించిన ఆధ్యాత్మిక గ్రంథాలలో జటాయువుకు, లేపాక్షికి ఉన్న సంబంధం గురించి పేర్కొన్నారు.
తిరుపుట్‌కుఝి: తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని తిరుపుట్‌కుఝి (Thiruputkuzhi) వద్ద ఉన్న విజయరాఘవ పెరుమాళ్ ఆలయం, రాముడు జటాయువుకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. 108 దివ్య దేశాలపై టీటీడీ ప్రచురించిన పుస్తకంలో ఈ ఆలయానికి జటాయువుతో ఉన్న సంబంధం, ఇక్కడి పవిత్ర జలాశయమైన `జటాయు తీర్థం`, జటాయువుకు అంకితం చేసిన మందిరం గురించి వివరించారు.
తిరుపుల్లభూతంగుడి: తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని తిరుపుల్లభూతంగుడి (Thirupullabhoothangudi) మరో ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడి ఆలయాన్ని `జటాయు మోక్ష స్థలం`గా పూజిస్తారు. రాముడు ఇక్కడ జటాయువుకు అంత్యక్రియలు నిర్వహించాడని ఆలయ సంప్రదాయాలు చెబుతున్నాయి.

తాకేడ్: మహారాష్ట్రలోని నాసిక్ సమీపం ఉన్న తాకేడ్‌లో (Taked) మరో కథనం వాడుకలో ఉంది. రావణుడితో పోరాడిన తర్వాత జటాయువు ఇక్కడే పడిపోయాడనే విశ్వాసంతో ఇక్కడ 'సర్వతీర్థ జటాయు మందిరం' నిర్మించారు. ప్రాణాలు విడుస్తున్న జటాయువు దాహం తీర్చడానికి రాముడు నేలపై బాణం వేసి గంగాజలాన్ని రప్పించాడని స్థానిక కథనం. ఆ జలాశయాన్ని 'సర్వతీర్థం' అని పిలుస్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND Vs NZ | వన్డే సిరీస్ భారత్‌దే.. ఐదో వన్డేలో 22 పరుగుల తేడాతో గెలుపు
నవంబర్ 15, 2026

Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?
నవంబర్ 15, 2026

Trump Gold Card | ట్రంప్ గోల్డ్ కార్డ్ చూశారా..? అమెరికాలో స్థిరపడాలంటే ఇది కావాల్సిందే..!
నవంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!
- ●Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?
- ●Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!
- ●Deeksha Diwas | దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు 'దీక్షా దివస్' ప్రత్యేక కార్యక్రమాలు
- ●Cyclone Akvan | ఏపీపై 'అక్వాన్' తుఫాన్ పంజా.. అమరావతికి మళ్లీ ముంపు ముప్పు!
- ●Rashmika Mandanna | ఏనాటి వరమో నువ్వు - తండ్రి ప్రేమను గుర్తుచేసుకున్న రష్మిక

Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!

Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?

Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!

Deeksha Diwas | దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు 'దీక్షా దివస్' ప్రత్యేక కార్యక్రమాలు



