త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మ‌ళ్లింపు

Heavy Rain In Delhi | జన్మాష్టమి పర్వదినాన ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో కొద్దిరోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో జన్మాష్టమి వేడుకలకు అనుకూల వాతావరణం ఏర్పడింది.

P

National | Published On Sep 4, 2026, 7.30 pm IST

Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మ‌ళ్లింపు
Advertisement

Heavy Rain In Delhi | జన్మాష్టమి పర్వదినాన ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో కొద్దిరోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో జన్మాష్టమి వేడుకలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఢిల్లీతో పాటు నోయిడా, ఘాజియాబాద్‌, ఫరీదాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచ‌నా వేసింది.

ఢిల్లీ విమానాశ్రయంలోకి నీరు..

మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన కనీసం తొమ్మిది విమానాలను ఇతర ప్రాంతాలకు దారి మళ్లించారు. వీటిలో నాలుగు విమానాలను జైపూర్‌కు, మరో నాలుగింటిని లఖ్‌నవూకు, ఒక విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించినట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

శనివారం వ‌ర్షాలు ప‌డే ఛాన్స్‌..
గురువారం ఢిల్లీలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైనప్పటికీ వర్షం పడలేదు. గరిష్ట‌ ఉష్ణోగ్రత 34.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 0.8 డిగ్రీలు ఎక్కువ. గత 24 గంటల్లో గరిష్ట‌ ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలు పెరిగింది. కనిష్ట‌ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై.. సాధారణం కంటే 1.4 డిగ్రీలు అధికంగా ఉంది. అయితే, గత 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ వ‌ర‌కు త‌గ్గాయి. శుక్ర, శనివారాల్లో ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు, అలాగే రాత్రి వేళల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement
Advertisement