త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ‌

DK Aruna | రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, పెండింగ్‌లో ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబ‌ర్స్ంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Aug 24, 2026, 4.37 pm IST

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ‌
Advertisement

DK Aruna | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, పెండింగ్‌లో ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబ‌ర్స్ంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సరైన విద్యను అందించలేకపోతున్నామని సీఎం స్వయంగా తన వైఫల్యాన్ని ఒప్పుకున్నారని.. తక్షణమే రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పుకోవాల‌న్నారు. నిధులు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండి పోరాడుతుంద‌న్నారు. 'ఫీజు బకాయి - బీజేపీ లడాయి' 48 గంటల నిరాహార దీక్షలో సోమ‌వారం ఆమె పాల్గొని మాట్లాడారు.

​విద్యార్థి నాయకుడిగా ప్రారంభమై, ఎమ్మెల్సీగా ప్రజాసేవ చేసి, నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన శ్రీ ఎన్. రామచందర్ రావు గారికి విద్యార్థుల కష్టాలు, సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది. విద్యార్థుల పక్షాన నిలబడి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా.

ఫీజు చెల్లించేందుకు తాళిబొట్లు తాక‌ట్టు పెడుతున్న‌రు..

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక కోర్సులు పూర్తయినా విద్యార్థులకు సర్టిఫికెట్లు చేతికి రావడం లేదు. కాలేజీ ఫీజులు చెల్లించేందుకు పేద విద్యార్థుల తల్లులు తమ తాళిబొట్లు సైతం తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది?

రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి..

​రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి యువతకు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి? ఉన్నత చదువుల కోసం బ్యాంకుల ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి వద్దే ఉంది. విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటూ ఆయనే అవమానించడం దుర్మార్గం. రాష్ట్రంలో సరైన విద్యను అందించలేకపోతున్నామని సీఎం స్వయంగా ఒప్పుకున్నారు. తక్షణమే విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పుకుని రాజీనామా చేయాలి.

Advertisement
Advertisement