Farmers Protest | కరెంటు కోతలపై రైతన్న కన్నెర్ర.. పురుగు మందు డబ్బాలతో ఆందోళన
Farmers Protest | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి టీ గ్రామంలోలోని సబ్‌స్టేషన్ ముందు గోముత్రి గ్రామ అన్నదాతలు పురుగు మందుల డబ్బాలతో అర్ధనగ్నంగా బైఠాయించారు.
Farmers Protest | త్రినేత్ర న్యూస్: కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు గురువారం వినూత్న నిరసనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి టీ గ్రామంలోలోని సబ్‌స్టేషన్ ముందు గోముత్రి గ్రామ అన్నదాతలు పురుగు మందుల డబ్బాలతో అర్ధనగ్నంగా బైఠాయించారు. తమ ప్రాంతంలో ఇష్టారాజ్యంగా కోతలు విధిస్తుండడంతో పంటలు ఎండిపోతున్నాయంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
తరచూ కరెంట్ కోతలు విధిస్తుండడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 15 నుంచి 20 సార్లు కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని వాపోతున్నారు. వర్షాలు లేకపోవడంతో బావుల ద్వారా పంటలకు నీరు అందిద్దామనుకుంటే, త్రీఫేజ్ కరెంటు కూడా సరిగా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. పంటలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయని, ఇక తమ జీవనం ఎలా కొనసాగించాలని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు 15 వేల పీక్ డిమాండ్ ఉండాల్సింది 20 వేల వరకు వెళ్లిందని.. అయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పవర్ సప్లై చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోందని పేర్కొంటోంది. కాగా కళ్లముందు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని అన్నదాతలు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
కరెంటు కోతలకు నిరసిస్తూ పురుగుల మందు డబ్బాతో సబ్‌స్టేషన్ ముందు రైతుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి టీ గ్రామంలో సబ్‌స్టేషన్ ముందు గోముత్రి గ్రామ రైతుల ఆందోళన
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతుల ఆవేదన
కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ https://t.co/taxcCALbv0
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2026
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!






