త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఇంజినీర్లతో రైతులపై కేసులు పెట్టించడం ప్రభుత్వ దిగజారుడుతన‌మే

Harish Rao | రైతులు సాగునీళ్ల‌డిగితే ఇంజినీర్ల‌తో వారిపై అక్ర‌మ కేసులు పెట్టించ‌డం ప్ర‌భుత్వ దిగ‌జారుడుత‌న‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్ రావు మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 8, 2026, 3.05 pm IST

Harish Rao | ఇంజినీర్లతో రైతులపై కేసులు పెట్టించడం ప్రభుత్వ దిగజారుడుతన‌మే
Advertisement
  • సాగునీళ్ల‌డిగితే కేసులా.. ఇదెక్క‌డి దుర్మార్గం, ఇదెక్క‌డి అన్యాయం
  • పంట‌లు ఎండ‌డం మీ చేత‌గానిత‌న‌మే
  • రేవంత్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఫైర్‌

Harish Rao | త్రినేత్ర న్యూస్: రైతులు సాగునీళ్ల‌డిగితే ఇంజినీర్ల‌తో వారిపై అక్ర‌మ కేసులు పెట్టించ‌డం ప్ర‌భుత్వ దిగ‌జారుడుత‌న‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్ రావు మండిప‌డ్డారు. ఇదెక్క‌డి దుర్మార్గం, ఇదెక్క‌డి అన్యాయ‌మ‌ని నిల‌దీశారు. కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశ‌పూర్వకంగా నిర్లక్ష్యం వహించింది మీరు కాదా అని ప్ర‌శ్నించారు. మీ చేత‌గానిత‌నం వ‌ల్ల‌నే పంట‌లు ఎండిపోతున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈమేర‌కు గురువారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

క‌డుపు మండి రోడ్డెక్కితే అక్ర‌మ కేసులా?

కండ్ల ముందే ఎండుతున్న పంటలకు జూరాల నీటిని విడుదల చేయాలని ఆందోళన బాట పట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత హేయమైన చర్య. రేవంత్ పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం పరిపాటిగా మారడం సిగ్గుచేటు. మీ చేతగాని తనం వల్ల ఈరోజు పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్న దుస్థితి ఉంది. కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? పోలీసులను ప్రయోగించి భయబ్రాంతులకు గురి చేస్తారా? ఇదెక్కడి దుర్మార్గం? ఇదెక్కడి అన్యాయం?

వెంట‌నే కేసులు తీసేయండి

నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం త‌ప్పు చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా? సాగునీళ్లు, కరెంట్‌ లేక రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే.. ప‌రిష్కరించాల్సింది పోయి అక్రమ కేసులు పెడతారా? ఇది ప్రజా పాలననా? లేక ప్రజా పీడననా? రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతు వ్యతిరేక చర్యలు ఇలాగే కొనసాగిస్తే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement