త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Santosh Kumar | సిట్ విచారణకు హాజరవుతా : సంతోష్ కుమార్

Santosh Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ త‌న‌కు జారీ చేసిన నోటీసుల‌పై బీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. మంగళవారం సిట్ కార్యాలయానికి వెళ్తానని, విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు.

S

Telangana | Published On Jan 26, 2026, 7.04 pm IST

Santosh Kumar | సిట్ విచారణకు హాజరవుతా : సంతోష్ కుమార్
Advertisement

Santosh Kumar | త్రినేత్ర.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ త‌న‌కు జారీ చేసిన నోటీసుల‌పై బీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. మంగళవారం సిట్ కార్యాలయానికి వెళ్తానని, విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసుల విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

సిట్‌కు ఉన్న‌ నాలెడ్జ్ ఇదేనా..?

ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల జారీ నేప‌థ్యంలో సిట్‌కు ఉన్న నాలెడ్జ్ ఏంటో తేలిపోయింద‌ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విమ‌ర్శిస్తున్నారు. సంతోష్ కుమార్‌కు జారీ చేసిన నోటీసులు త‌ప్పులత‌డ‌క‌గా ఉంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం సంతోష్ కుమార్ కేవ‌లం పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ఎప్పుడో ముగిసింది. ఆ మాత్రం అవ‌గాహ‌న లేని సిట్ అధికారులు.. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యులుగా కొన‌సాగుతున్న‌ట్టు సిట్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఆయ‌న పేరును కూడా త‌ప్పుగా పేర్కొన్నారు. ఆయ‌న అస‌లు పేరు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ కాగా, నోటీసుల్లో మాత్రం జోగినిప‌ల్లి సంతోష్ రావు అని పేర్కొన‌డం సిట్ అధికారులకు ఉన్న అవ‌గాహ‌న రాహిత్యం బ‌య‌ట‌ప‌డింద‌ని బీఆర్ఎస్ నేత‌లు మండిప‌డ్డారు. ఆ నోటీసుల్లో ఉన్న అడ్ర‌స్ కూడా స‌రికాద‌ని, ఏ మాత్రం అవ‌గాహ‌న లేకుండా.. నోటీసులు జారీ చేస్తున్నార‌ని పార్టీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement