త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Review on Global Summit | గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు వ‌చ్చే ప్ర‌తినిధులకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ఉండాలి

Review on Global Summit | గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ (Global Summit)కు చాలా మంది ప్ర‌తినిధులు వ‌స్తార‌ని.. వారి కోసం ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.

S

Telangana | Published On Nov 23, 2026, 3.38 pm IST

Review on Global Summit | గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు వ‌చ్చే ప్ర‌తినిధులకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ఉండాలి
Advertisement
  • విధుల్లో ఉన్న అధికారులకు శిక్షణ ఇవ్వాలి
  • ఫేషియల్ రికగ్నిషన్‌తో ప్రతినిధులకు ప్రవేశం కల్పించాలి
  • సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలను సమ్మిట్‌లో ఉపయోగించాలి
  • సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌లు

Review on Global Summit | త్రినేత్ర న్యూస్‌: గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ (Global Summit)కు చాలా మంది ప్ర‌తినిధులు వ‌స్తార‌ని.. వారి కోసం ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. ప్ర‌తినిధుల‌తో అత్యంత‌ మర్యాద‌గా వ్య‌వ‌హ‌రించేందుకు విధుల్లో ఉన్న అధికారుల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌న్నారు. ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్‌తో ప్ర‌తినిధుల‌కు ప్ర‌వేశం క‌ల్పించాల‌ని చెప్పారు. స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ ఆల‌యంలో ఉన్న తోర‌ణాల న‌మూనాల‌ను స‌మ్మిట్‌లో ఉప‌యోగించాల‌ని సూచించారు. హైద‌రాబాద్‌ (Hyderabad)లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సోమ‌వారం గ్లోబల్ సమ్మిట్‌పై నిర్వ‌హించిన స‌మీక్ష సంద‌ర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు.

సమ్మిట్‌కు పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలి. మెరుగైన ఇంటర్నెట్ నెట్‌వర్క్ సదుపాయం కల్పించాలి. ప్రతినిధుల కోసం లైజనింగ్ ఆఫీసర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలను సమ్మిట్‌లో ఉపయోగించాలి. గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించే ఎయిర్ షోతో పాటు ఇతర కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలి.

ఆహ్వానాలు పంపేప‌ట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించాలి

ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించాలి. దేశ, విదేశాల్లో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు సమ్మిట్‌లోని ఎడ్యుకేషన్ పెవిలియన్‌లో పాల్గొనేలా చూడాలి. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు అని రేవంత్‌రెడ్డి హెచ్చించారు.

ఈ స‌మీక్ష‌లో మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్‌ సంజయ్ జాజు, పోలీసు ఉన్న‌తాధికారులు, సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement