త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | 45 టీఎంసీల‌కు ఒప్పుకుంటే.. పాల‌మూరును ద‌గా చేసిన‌ట్లే : శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud | పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి 45 టీఎంసీల‌కు ఒప్పుకుంటే.. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాను ద‌గా చేసిన‌ట్లే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

S

Telangana | Published On Dec 23, 2025, 5.54 pm IST

Srinivas Goud | 45 టీఎంసీల‌కు ఒప్పుకుంటే.. పాల‌మూరును ద‌గా చేసిన‌ట్లే : శ్రీనివాస్ గౌడ్
Advertisement

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్ : పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి 45 టీఎంసీల‌కు ఒప్పుకుంటే.. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాను ద‌గా చేసిన‌ట్లే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డితో క‌లిసి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే పీసీసి అధ్యక్షులు, మంత్రులు అయ్యారు. కేసీఆర్ మాట్లాడిన అంశాలపై కాంగ్రెస్ నేత‌లు స‌మీక్ష చేసుకోవాలి. కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పాలమూరు పచ్చబడితే కాంగ్రెస్ కళ్లు ఎర్రబడ్డాయి. ఎస్ఎల్‌బీసీ కుప్ప‌కూలి మ‌న‌షులు చనిపోతే ఇప్ప‌టి వ‌ర‌కు శ‌వాల‌ను వెలికితీయ‌లేదు. రూ. 7 వేల కోట్లు ఎక్క‌డ ఖ‌ర్చు పెట్టారో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పాల‌ని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

డ్రింకింగ్ వాటర్ కోసం ఎవరి అనుమతులు అవసరం లేదు. రిజర్వాయర్లన్నీ డ్రింకింగ్ వాటర్ కోసం కట్టారా..? పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు ఏడు అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే వచ్చాయి. 45 టీఎంసీలు అంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఏం కావాలి..? రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, లోక్‌సభ సభ్యులు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. తెలంగాణ హక్కుల గురించి బరాబర్ మాట్లాడుతాం. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చ‌ర్చ‌కు రావాల‌ని శ్రీనివాస్ గౌడ్ స‌వాల్ విసిరారు.

మీ ముఖాల‌కు రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు. తెలంగాణపై రేవంత్ రెడ్డికి సోయి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తప్ప తెలంగాణలో ఉన్న తొమ్మిది జిల్లాలు కరువు జిల్లాలుగా ఉండేవి. కేసీఆర్‌ను చూసి గజగజ వణుకుతున్నారు. మ‌రో రెండేండ్ల‌లో కాంగ్రెసోళ్ల పని అయిపోవ‌డం ఖాయం. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ఇస్తామనిబీజేపీ హామీ ఇచ్చి మోసం చేసింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో కాదు పెట్టేది.. ఢిల్లీలో పెట్టాలి అని కాంగ్రెస్ నేత‌ల‌కు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement