త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | హెల్త్ కార్డ్స్ కోసం ఉద్యోగులు, పెన్ష‌న్‌దారులు ఎదురుచూపు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud | రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న్దారులు హెల్త్ కార్డ్స్ కోసం ఎదురుచూస్తున్నార‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హెల్త్ కార్డ్స్ ఇవ్వ‌కుండా ఈ ప్ర‌భుత్వం జాప్యం చేస్తుంద‌ని, దీంతో 10 నుంచి 15 లక్షల కుటుంబాల ఉద్యోగులు, పెన్షన్ దారులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు.

S

Telangana | Published On Jun 12, 2026, 2.54 pm IST

Srinivas Goud | హెల్త్ కార్డ్స్ కోసం ఉద్యోగులు, పెన్ష‌న్‌దారులు ఎదురుచూపు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Advertisement

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న్దారులు హెల్త్ కార్డ్స్ కోసం ఎదురుచూస్తున్నార‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హెల్త్ కార్డ్స్ ఇవ్వ‌కుండా ఈ ప్ర‌భుత్వం జాప్యం చేస్తుంద‌ని, దీంతో 10 నుంచి 15 లక్షల కుటుంబాల ఉద్యోగులు, పెన్షన్ దారులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేండ్లు అవుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగుల‌కు, పెన్ష‌న్‌దారుల‌కు హెల్త్ కార్డులు ఇవ్వ‌డం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదు. హెల్త్ కార్డ్స్ ఇష్యూపై కమిటీ వేశారే తప్పా, హెల్త్ కార్డ్స్ మాత్రం ఇవ్వడం లేదు. కమిటీ ముఖ్యమంత్రి మాట వినడం లేదా, ముఖ్యమంత్రి మాట కమిటీ వినడం లేదా అర్ధం కావడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో రావడం లేదు. ప్రభుత్వ ధోరణి ఇలానే ఉంటే రాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుంది అని శ్రీనివాస్ గౌడ్ హెచ్చ‌రించారు.

పీఆర్సీ ఇవ్వడం లేదు..

కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయినట్లు ప్రభుత్వ తీరు ఉంది. పీఆర్సీ 6 నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పి రెండున్నరయేండ్లు అవుతున్న పీఆర్సీ ఇవ్వడం లేదు. ఈహెచ్ఎస్‌ను ఆస్ప‌త్రుల‌ను న‌మ్మే ప‌రిస్థితి లేకుండా పోయింది. బీఆర్ఎస్ హ‌యాంలో ఉద్యోగుల‌ను కాపాడుకున్నాం. పీఆర్సీపై కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి ఉద్యోగుల ఓట్లు దండుకుంది. ఒక్కో ఉద్యోగి నుంచి నెలకు 2 వేల నుంచి 3 వేల వరకు డబ్బులు కట్ అవుతున్నాయి. ఉద్యోగి జీతం నుంచి డబ్బులు కట్ చేయ‌మని ఈ ప్రభుత్వానికి చెప్పింది ఎవరు..? అని శ్రీనివాస్ గౌడ్ నిల‌దీశారు.

ఉద్యోగులను తక్కువ చేసి చూస్తే ఊరుకునేది లేదు..

ఆరోగ్య శ్రీ ట్రీట్‌మెంట్‌కు ఆసుపత్రి యాజమాన్యం అడ్మిట్ చేసుకోవడం లేదు. ఈహెచ్ఎస్ ట్రీట్‌మెంట్ విషయంలో ఉద్యోగులను తక్కువ చేస్తే ఆ ఆసుపత్రిపై సీఎస్ చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది. ఉద్యోగులను తక్కువ చేసి చూస్తే ఊరుకునేది లేదు. తెలంగాణ కోసం కొట్లాడిన ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యం విషయంలో ఉద్యోగులు వెనక్కి తగ్గేదే లేదు. ఆరోగ్యం విషయంలో ఉద్యోగులు చనిపోతే పూర్తి బాధ్యత వహించాలి అని డిమాండ్ చేస్తున్నాము. జూన్ 1 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెల్త్ కార్డ్స్ ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. మాతో కలిసొచ్చిన ఉద్యోగ సంఘాలతోనే మేము కలిసి పోరాడుతాం అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement