త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఓట‌మికి కాంగ్రెస్ పార్టీనే కార‌ణం : కేటీఆర్

KTR | రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఓట‌మికి కార‌ణం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Jun 12, 2026, 4.20 pm IST

KTR | మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఓట‌మికి కాంగ్రెస్ పార్టీనే కార‌ణం : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఓట‌మికి కార‌ణం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

పార్టీకి ఎవ‌రు ద్రోహం చేశారో వాళ్లే తెలుసుకోవాలి. ఆమెపై ఉన్న కేసు వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారో విచారణ జరుపుకోవాలి. పదే పదే సిట్ అనే ముఖ్యమంత్రి, ఈ అంశం పైన కూడా సిట్ వేసుకోవచ్చు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ‘బ్లాక్ షీప్’ (పార్టీ ద్రోహులు) ఎవరో కనుక్కోవాలి అని కేటీఆర్ అన్నారు.

ముమ్మాటికీ ఆయన చేసిన పనినే ఇది..

కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు. అలాంటి కాంగ్రెస్ కంపులో, ద్రోహుల పార్టీ అంశంలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారు. మీనాక్షి నటరాజన్‌కి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసు. ముమ్మాటికీ ఆయన చేసిన పనినే ఇది. కాంగ్రెస్ పార్టీనే కుట్రలు చేసుకొని, అందులో ప్రతిపక్షాలను ఎందుకు లాగుతున్నారో తెలుసుకోవాలన్నారు.

షబ్బీర్ అలీ చెప్పిన మాటలు ముమ్మాటికీ వాస్తవం

కాంగ్రెస్ పార్టీలో పదవులు, డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ చెప్పినందుకు అభినందనలు. షబ్బీర్ అలీ ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారు. అసలు గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనే కదా! ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా డబ్బులకే అమ్ముకున్నది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్న వ్యక్తే కదా! రేవంత్ రెడ్డి పేమెంట్ కోటా సీటు అన్న విషయం అందరికీ తెలుసు. ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుంది. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని అందరికీ తెలుసు. కాబట్టి, షబ్బీర్ అలీ చెప్పిన మాటలు ముమ్మాటికీ వాస్తవం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement