త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AK47 | ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ కూతురిగా యువినా పార్థవి.. నవ్వులు పంచుతున్న గ్లింప్స్..!

AK47 | విక్టరీ వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' (ఏకే47) సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వినూత్నంగా కొనసాగిస్తున్న చిత్రబృందం తాజాగా మరో కీలక పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది.

P

Entertainment | Published On Jul 29, 2026, 5.08 pm IST

AK47 | ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ కూతురిగా యువినా పార్థవి.. నవ్వులు పంచుతున్న గ్లింప్స్..!
Advertisement

AK47 | విక్టరీ వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' (ఏకే47) సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వినూత్నంగా కొనసాగిస్తున్న చిత్రబృందం తాజాగా మరో కీలక పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది. సినిమాలో వెంకటేశ్ కుమార్తె 'సంపూర్ణ' పాత్రలో బాలనటి యువినా పార్థవి నటిస్తున్నట్లు ప్రకటిస్తూ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి స్పందన వ‌స్తోంది.

విడుదలైన గ్లింప్స్‌లో చిట్టిబాబు పాత్రలో కనిపిస్తున్న వెంకటేశ్ ఇంటి విషయాలపై రఘుబాబుతో మాట్లాడుతుండగా, సంపూర్ణ పాత్రలో యువినా పార్థవి ఉత్సాహంగా వచ్చి "నాన్నా... నేను ప్రేమలో పడ్డాను" అని చెబుతుంది. వెంటనే చిట్టిబాబు ఆశ్చర్యంతో పాటు చిరాకు వ్యక్తం చేస్తూ "ఈసారి కార్ డ్రైవర్‌తోనా.. మెకానిక్‌తోనా?" అని ప్రశ్నిస్తాడు. తండ్రీకూతుళ్ల మధ్య సాగే ఈ సరదా సంభాషణ నవ్వులు పంచుతూనే సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పకనే చెబుతోంది. ఈ సినిమాకు సంబంధించి పాత్రల పరిచయాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఆసక్తిని పెంచుతోంది చిత్రబృందం. ఇప్పటికే వెంకటేశ్‌ను చిట్టిబాబు పాత్రలో, శ్రీనిధి శెట్టిని ఆయన భార్య స్వర్ణ పాత్రలో పరిచయం చేశారు.

తాజాగా యువినా పార్థవి పాత్రను కూడా రివీల్ చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా చిన్న వయసులోనే నటనతో గుర్తింపు తెచ్చుకున్న యువినా పార్థవి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్, శ్రీనిధి శెట్టి, యువినా పార్థవితో పాటు నివేదా పేతురాజ్, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తుండగా.. ఛాయాగ్రహణం రవి కే చంద్రన్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'ను 2026 అక్టోబర్ 2న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement