త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | బీసీల గొంతు కొద్దాం అనుకుంటున్నారా..?

Srinivas Goud | స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత మెజార్టీ వ‌ర్గాల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిప‌డ్డారు. కాంగ్రెస్, బీజేపీలు క‌లిసి బీసీల గొంతు కొద్దాం అనుకుంటున్నారా..? అని ఆయ‌న నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Aug 30, 2026, 7.40 pm IST

Srinivas Goud | బీసీల గొంతు కొద్దాం అనుకుంటున్నారా..?
Advertisement

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్ : స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత మెజార్టీ వ‌ర్గాల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిప‌డ్డారు. కాంగ్రెస్, బీజేపీలు క‌లిసి బీసీల గొంతు కొద్దాం అనుకుంటున్నారా..? అని ఆయ‌న నిప్పులు చెరిగారు. ఢిల్లీలో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

బీసీలు రాజ‌కీయంగా, విద్యా, ఉద్యోగ‌, ఉపాధి రంగాల్లో అణిచివేయ‌బ‌డ్డారు. ఎంత జనాభా ఉంటే అంత రిజ‌ర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పి నోరుమెదపడం లేదు.. సెన్సస్‌లో బీసీ జనగణన చేస్తామని బీజేపీ ఆచరించడం లేదు. భారతదేశంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే మెజారిటీ వర్గాలను అక్కున చేర్చుకోవాలి. తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, తెలంగాణాలో జనాభా ప్రాతిపదికన రిజ‌ర్వేష‌న్లు ఇచ్చారు. కానీ న్యాయపరంగా ఇబ్బందులు వస్తున్నాయి.. రాజ్యాంగ బద్దంగా లేదని కోర్టులు కొట్టేస్తున్నాయి. సెన్సెస్‌లో లేనప్పుడు ఇంత ప‌ర్సెంటేజీ అని రిజ‌ర్వేషన్ ఎలా ఇస్తారని న్యాయస్థానాలు అడుగుతున్నాయి. రాజ్యాంగ సవరణ చేయాలి.. సెన్సస్‌లో బీసీ గణన చేయాలి అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

కేంద్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్.. బీసీ గ‌ణ‌న కోసం పార్ల‌మెంట్‌ను స్తంభింప‌జేయాలి. ప్ర‌భుత్వాన్ని నిల‌దీసి ప్ర‌తి కులానికి ఒక నంబ‌రింగ్ ఇచ్చేలా డిమాండ్ చేశారు. ప్ర‌తి కులానికి ఒక నంబ‌రింగ్ ఇవ్వ‌కుండ న్యాయం ఎలా చేస్తారు..? స‌ర్వేతో ఒక్క రూపాయి ఖ‌ర్చు కాదు.. హౌస్ హోల్డ్ స‌ర్వేలో ఎక్క‌డ కుల గ‌ణ‌న ప్ర‌స్తావ‌న లేనేలేదు. క‌శ్మీర్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ల‌డ‌ఖ్‌, ఉత్త‌రాఖండ్‌లో వ‌చ్చే నెల‌లో గ‌ణ‌న ప్రారంభ‌మవుతుంది. ఈ రోజు వ‌ర‌కు కూడా బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి..? ఏ కులానికి ఏ నంబ‌ర్ ఇచ్చారో కూడా లేదు. ఎవ‌రి చెవిలో పూలు పెడుదాం అనుకుంటున్నారు..? దీనిపై ప్ర‌తిప‌క్ష పార్టీ మాట్లాడ‌డం లేదు. అధికార పార్టీ అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. బీసీల సంఖ్య తెలిస్తే వారి పునాదులు క‌దులుతాయ‌ని భ‌య‌ప‌డుతున్నారా..? అని శ్రీనివాస్ గౌడ్ ప్ర‌శ్నించారు.

జ‌న గ‌ణన వాయిదా వేసి ఎస్సీ, ఎస్టీల త‌ర‌హాలో కులాల‌కు నంబ‌రింగ్ ఇవ్వాలి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులాన్ని ఒక్కో విధంగా పిలుస్తారు. దానిపై ప‌రిశీల‌న చేసి జాబితా త‌యారు చేసి నంబ‌రింగ్ ఇవ్వాలి. 80 కోట్ల జ‌నాభా ఉన్న ఓబీసీల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో ఎలాంటి న్యాయం జ‌ర‌గ‌డం లేదు. గ‌ణ‌న వాయిదా వేసి బీసీ కులాల‌కు నంబ‌రింగ్ ఇవ్వ‌కుంటే ఓబీసీలు బీజేపీని ఎట్టి ప‌రిస్థితుల్లో క్ష‌మించ‌రు. ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తే యువ‌త పోరాటం చేసిన‌ట్టు ఓబీసీలు ఆందోళ‌న బాట ప‌డుతార‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement