త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | 22ఎ మీద హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జ‌రిపించాలి.. ఇందిరాపార్క్ ధ‌ర్నాకు త‌ర‌లి రావాలి

Ramchandar Rao | 22ఎ నిషేధిత భూముల‌పై హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు. దీనిమీద సెప్టెంబ‌ర్ 5న ఇందిరాపార్క్ వ‌ద్ద నిర్వ‌హించే మ‌హాధ‌ర్నాకు పెద్దఎత్తున త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Aug 30, 2026, 5.52 pm IST

Ramchandar Rao | 22ఎ మీద హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జ‌రిపించాలి.. ఇందిరాపార్క్ ధ‌ర్నాకు త‌ర‌లి రావాలి
Advertisement
  • కేసీఆర్ పాల‌న‌లో ఆయ‌న కుంటుంబం సంతోషంగా ఉంటే..
  • రేవంత్ పాల‌న‌లో ఆయ‌న సోద‌రులు సంతోషంగా ఉన్న‌రు
  • బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు తీవ్ర విమ‌ర్శ‌లు

త్రినేత్ర‌.న్యూస్: 22ఎ నిషేధిత భూముల‌పై హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు. దీనిమీద సెప్టెంబ‌ర్ 5న ఇందిరాపార్క్ వ‌ద్ద నిర్వ‌హించే మ‌హాధ‌ర్నాకు పెద్దఎత్తున త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాల‌న‌లో ఆయ‌న కుటుంబం సంతోషంగా ఉంటే రేవంత్ పాల‌న‌లో ఆయ‌న సోద‌రులు సంతోషంగా ఉన్నార‌ని మండిప‌డ్డారు. సంతోషంగా ఉండాల్సింది ప్ర‌జ‌లని నొక్కి చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

డ్ర‌గ్స్ వల్లే 43 శాతం క్రైమ్‌రేట్‌..

క్యూర్ పేరుతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలను క్రష్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి 30 శాతం కమీషన్లు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారు. 43 శాతం క్రైమ్ రేట్ డ్రగ్స్ వల్ల పెరిగింది. డ్రగ్స్ ఎందుకు అరికట్టలేకపోతున్నావు రేవంత్ రెడ్డి. యువతకు సమాధానం చెప్పాలి.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వరు, ఉద్యోగాలు లేవు. యువత, విద్యార్థులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. సంతోషంగా ఉండాల్సింది మీరు కాదు.. ప్రజలు. 22ఎ మీద ఈటల రాజేందర్ గొప్ప పోరాటం చేస్తున్నారు. నూతన అధ్య‌క్షుడు గిరివర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నా అని రామచందర్ రావు పేర్కొన్నారు.

నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తున్నా: గిరివర్ధన రెడ్డి

ఈటల రాజేందర్ తండ్రిలా నన్ను నడిపిస్తున్నారు. నేను అత్యంత వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తున్నా. నాభార్య వనిత, పిల్లల సహాయ సహకారం నాకు ఉండబట్టే బయట నేను నాయకుడిగా తిరగగలుగుతున్నా. విద్యార్థి ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టినా రామచందర్ అన్న బెయిల్ ఇప్పిస్తాడు అనే ధైర్యం ఉండేది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేను ఫుల్ టైమర్‌గా పనిచేసిన. ఒక్కపూట తింటే చాలు అని కష్టపడ్డాం. మా తల్లిదండ్రుల మాట ఎప్పుడూ జవదాటలేదు.
పశువుల దగ్గరకి పొమ్మంటే పోయేవాడిని.

మా ఇంటికి నక్సలైట్లు వచ్చి నీ కొడుకును చంపుతా అని బెదిరించిపోయారు. వాల్ రైటింగ్ రాసారు, పోస్టర్ వేశారు. అయినా బ‌తికితే దేశం కోసం బ‌తుకుతా అని చెప్పిన. రాజేందర్ అన్న నాకు స్కూల్ పిల్లాడిలా పాఠాలు చెప్తారు. ఈ రాష్ట్రంలో పేదలకోసం కోట్లాడుతున్న వ్యక్తి ఈటల రాజేందర్. రాత్రి పగలు లేకుండా తిరుగుతారు. సమస్యలు ఎక్కడన్నా పరిష్కారం అవుతున్నాయి అంటే అది ఈటల రాజేందర్ గారి ఇంటిదగ్గరే. ఈ జీవితం ఉంటే రాజేందర్ అన్నలా ఉండాలి, దేశం కోసం, సనాతన ధర్మం కోసం ఉండాలని నిర్ణయించుకొని బీజేపీ రాజకీయాల్లోకి వచ్చాను.

మల్కాజిగిరిలో బీజేపీ గెలిపించి ఇద్దాం. శక్తిని మించి పనిచేద్దాం. సహనం కోల్పోవద్దు. రాబోయే కాలం మనదే. క్రియాశీలకంగా, కమిట్మెంట్ తో ఉండాలి. మల్కాజిగిరి నాయకులందరికీ నా హృదయపూర్వ‌క కృతజ్ఞతలు. మీకు మంచి పేరు తెస్తా తప్ప తలవంచుకునేలా ఉండను అని మాట ఇస్తున్న. మన సనాతన ధర్మం, దేశాన్ని విమర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించవద్దు. రాజ్యాంగం చేత పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఎందుకు కశ్మీర్‌లో రాజ్యాంగం అమలు చేయలేదు సన్నాసి అని అడగాలి. ఆరు గ్యారెంటేలు అమలు చేయని.. రేవంత్ రెడ్డి మెడలు వంచడానికి ఈ కార్యాలయం పనిచేస్తుంది. కేసీఆర్ అవినీతిని బయటికి తీసుకురావడానికి పనిచేస్తుంది. అందరం కలిసి పనిచేద్దాం.. కాషాయ జెండా ఏగురవేద్దాం.

అనంత‌రం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సమన్వయం ముఖ్యమ‌న్నారు. మన పదవి పూర్తి అయ్యాక కూడా మనలను గుర్తుపెట్టుకునేలా పని చేయాలన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. అధ్యక్షుడి ఎన్నికకు చాలా పోటీ ఉందని.. ఈ పోటీలో అధ్యక్షుడు అయిన గిరివర్ధన్ రెడ్డి మీద చాలా గొప్ప బాధ్యత ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విజయమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని కోరారు. కాచం వెంకటేశ్వర్లు ప్ర‌సంగిస్తూ.. గిరివర్ధన్ రెడ్డితో క‌లిసి ఏబీవీపీలో పనిచేశాన‌న్నారు. ఎవరినైనా సముదాయించి పార్టీ లైన్ లో పనిచేయించగలిగిన వ్యక్తిగా ఆయనకు పేరుందన్నారు. చిన్నవాడే అయిన అనుభవం పెద్దదని కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు జయశ్రీ, కొల్లి మాధవి, రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు రవి నాయక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ ఇంచార్జి రంగారెడ్డి, తాడూరి శ్రీనివాస్, కట్టా సుధాకర్, సుధాకర్ గాండే, పాపారావు, గోపురమణరెడ్డి, జెన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, వికె మహేష్, శేఖర్, తిరుపతి యాదవ్, సుధ, భరత్, వాసు, సత్యపాల్, ఆర్ కే శ్రీనివాస్, వడ్డేపల్లి రాజేశ్వర రావు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement