త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Satyavathi Rathod | మా ద‌గ్గ‌ర చెప్పులు లేవా..? మంత్రి సీత‌క్క‌కు స‌త్య‌వ‌తి రాథోడ్ స్ట్రాంగ్ కౌంట‌ర్

Satyavathi Rathod | అంగ‌న్‌వాడీ సెంట‌ర్ల‌కు అంద‌జేసిన మొబైల్ ఫోన్‌ల విష‌యంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఇరు పార్టీల మ‌ధ్య దూష‌ణ‌లకు అడ్డుఅదుపు లేకుండా పోయింది.

S

Telangana | Published On Apr 14, 2026, 3.45 pm IST

Satyavathi Rathod | మా ద‌గ్గ‌ర చెప్పులు లేవా..? మంత్రి సీత‌క్క‌కు స‌త్య‌వ‌తి రాథోడ్ స్ట్రాంగ్ కౌంట‌ర్
Advertisement

Satyavathi Rathod | త్రినేత్ర‌.న్యూస్ : అంగ‌న్‌వాడీ సెంట‌ర్ల‌కు అంద‌జేసిన మొబైల్ ఫోన్‌ల విష‌యంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఇరు పార్టీల మ‌ధ్య దూష‌ణ‌లకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. చెప్పు తెగుత‌ది అని మంత్రి సీత‌క్క చేసిన వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు స‌త్య‌వ‌తి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. మొబైల్ ఫోన్ల‌లో స్కామ్ జ‌ర‌గ‌లేద‌ని నిరూపించాల్సింది పోయి.. అడ్డ‌మైన మాట‌లు మాట్లాడుతున్నారు. చెప్పు తీసుకొని కొడతాన‌ని అంటే మా ద‌గ్గ‌ర చెప్పులు లేవా..? అని సీత‌క్క‌కు స‌త్య‌వ‌తి రాథోడ్ స్ట్రాంట్ కౌంట‌ర్ ఇచ్చారు.

మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. 'మంత్రి సీత‌క్క మీద అవినీతి ఆరోప‌ణ వ‌చ్చింది. దానికి స‌మాధానం స‌రైన రీతిలో చెప్పుకోవాలి. నిజంగా మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో మొబైల్ ఫోన్ల కొనుగులులో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింది. డ‌బ్బులు చేతులు మారాయ‌ని నీ మీద అవినీతి ఆరోప‌ణ వ‌చ్చింది. ఒక ద‌ళిత బిడ్డ అన్ని ఆధారాల‌తో బ‌య‌ట‌పెట్టిండు. నువ్వు కూడా ఆయ‌న లాగే కుంభ‌కోణం జ‌ర‌గ‌లేద‌ని ఆధారాల‌తో నిరూపించు. ఆయ‌న‌ను ప‌ట్టుకుని చెప్పు తెగుత‌ది.. చెప్పు తీసుకొని కొడుతా. ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం. ఆ మాట‌లు మాకు రావా..? ఆ ప‌ని మాకు రాదా..? మా ద‌గ్గ‌ర చెప్పులు లేవా..? అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని నిరూపించు. ఎంత సిగ్గు చేటు అంటే.. మ‌న ద‌గ్గ‌ర 4జీ ఫోన్లు ఇచ్చారు. ఏపీలో 5జీ ఫోన్లు ఇస్తే ఆ ఫొటోల‌ను మ‌న ద‌గ్గ‌ర ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇంత దిక్కుమాలిన చ‌ర్యా..?' అని మంత్రి సీత‌క్క‌పై స‌త్య‌వ‌తి రాథోడ్ మండిప‌డ్డారు.

Advertisement
Advertisement