Nurse Murdered case | అత్యాచారాన్ని అడ్డుకోబోయిన నర్సు.. అయినా దారుణ హత్య
Nurse Murdered case | తనపై జరుగుతున్న అత్యాచారాన్ని అడ్డుకోబోయిన ఓ యువ నర్సును దారుణంగా హత్య చేశాడో కామాంధుడు. కిటికీలోంచి చూసి లైంగిక వాంఛ పెంచుకొని ఈ కిరాతకానికి ఒడిగట్టాడు.
- కిటికీలోంచి చూసి లైంగిక వాంఛ పెంచుకున్న నిందితుడు
- తీవ్రంగా ప్రతిఘటించిన బాధితురాలు.. గొంతు నులిమి చంపేసిన కామాంధుడు
- నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు
Nurse Murdered case | త్రినేత్ర.న్యూస్: తనపై జరుగుతున్న అత్యాచారాన్ని అడ్డుకోబోయిన ఓ యువ నర్సును దారుణంగా హత్య చేశాడో కామాంధుడు. కిటికీలోంచి చూసి లైంగిక వాంఛ పెంచుకొని ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ఈ కేసులో నిందితుడైన బీహార్‌కు చెందిన మహ్మద్ సనుహుల్లా ఖాన్ (34)ను పోలీసులు అరెస్టు చేశారు.
శంషాబాద్ జోన్ డీసీపీ బి. రాజేష్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన యువతి (21) ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అక్కడే ఆవరణలోని హాస్టల్‌లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ సందర్భంగా తన గదిలో ఉండేవారు ఊరెళ్లారు. దీంతో యువతి శుక్రవారం రాత్రి తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు ఆమె బయటకు రాకపోవడంతో సిబ్బంది అనుమానంతో కిటికీలోంచి చూడగా విగతజీవిగా కనిపించింది. పినతల్లి ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
కిటికీలోంచి ప్రవేశించి..
బిహార్‌కు చెందిన సనుహుల్లా ఖాన్ హైదరాబాద్ వచ్చి ఉప్పల్‌లోని ఆనంద్ గౌడ్ మెకానిక్ షాప్‌లో బైక్ మెకానిక్ పని నేర్చుకున్నాడు. రెండు నెలల క్రితం తుక్కుగూడ వచ్చి ఆనంద్ గౌడ్‌కు చెందిన మరో షాప్ 'శ్రీ భాగ్యలక్ష్మి బైక్ మెకానిక్ షాప్'లో పనిచేస్తున్నాడు. ఆస్పత్రి పక్కనే ఉన్న ఈ మెకానిక్ షాపులో పనిచేస్తూ అక్కడే నిద్రించేవాడు. అతడికి మద్యం తాగడం, పోర్నోగ్రఫీ చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో పనిచేసే నర్సుల కదలికలను గమనించడం మొదలు పెట్టాడు. శుక్రవారం యువతి (21) ఒంటరిగా ఉన్న విషయం గమనించి.. అర్ధరాత్రి హాస్టల్‌లోకి చొరబడ్డాడు. ఆమె ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో దాని ద్వారా లోపలికి ప్రవేశించాడు. లైంగిక దాడికి ప్రయత్నించగా యువతి తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేసింది. తన గోర్లతో నిందితుడి ఛాతి, గొంతుపై గీరినప్పటికీ గొంతు నులిమి హత్య చేశాడు.
ఏం జరిగిందంటూ డ్రామా..
కాగా అంతకు ముందు పోలీసుల ముందే నిందితుడు సనావుల్లా ఖాన్ దర్జాగా తిరిగాడు. డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు ఆస్పత్రి ఆవరణలో తనిఖీలు జరుపుతున్న టైంలో ఏం జరిగింది? అంటూ పోలీసులనే ఆరా తీశాడు. జాగిలాలు నేరుగా మెకానిక్ షాపు దగ్గరకే వెళ్లడంతో యజమానికి విచారించారు. నేరం జరిగిన అర్ధరాత్రి నిందితుడు పదే పదే కాల్ చేశాడని షాపు యాజమానికి పోలీసులకు చెప్పడంతో తమదైన శైలిలో విచారించగా సనావుల్లా ఖాన్ నేరం అంగీకరించాడు. నిందితుడి నుంచి సామ్‌సంగ్ మొబైల్ ఫోన్, దుస్తులను స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు.
ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదికలో యువతిపై లైంగిక దాడి జరిగినట్లు తేలింది. అయితే నిందితుడి ఒక్కడి ప్రమేయమే ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరిన్ని వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. అలాగే నిందితుడు రోహింగ్యా అంటూ జరిగిన ప్రచారాన్ని పోలీసులు ఖండించారు.
సంబంధిత వార్తలు

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
సెప్టెంబర్ 12, 2026

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
సెప్టెంబర్ 12, 2026

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు




