త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సిద్దిపేట జిల్లాకు ప‌దేళ్లు.. కీర్తి ఎల్ల‌లు దాటేలా వేడుక‌లు చేద్దాం

Harish Rao | సిద్దిపేట జిల్లా పదేళ్ల పండుగ సందర్బంగా సిద్దిపేట జిల్లా ఖ్యాతి... కీర్తి ఎల్లలు దాటేలా ఘనంగా వేడుకగా నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 4, 2026, 7.39 pm IST

Harish Rao | సిద్దిపేట జిల్లాకు ప‌దేళ్లు.. కీర్తి ఎల్ల‌లు దాటేలా వేడుక‌లు చేద్దాం
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్ : సిద్దిపేట జిల్లా పదేళ్ల పండుగ సందర్బంగా సిద్దిపేట జిల్లా ఖ్యాతి... కీర్తి ఎల్లలు దాటేలా ఘనంగా వేడుకగా నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ అసోసియేషన్‌లు, అడ్వకేట్స్, డాక్టర్స్, సిద్దిపేట ప్రముఖులతో పదేళ్ల పండుగపై సన్నాహాక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా 1983 నుండి నినాదంగానే మిగిలిందని కానీ.. నాడు సిద్దిపేట జిల్లా కావాలని అర్జీ పెట్టిన నాయకుడు కేసీఆర్.. తెలంగాణ వచ్చాక తొలి ముఖ్యమంత్రిగా తానే ఆరంభం చేసారని.. 2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లాను ప్రారంభించి చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారన్నారు. సిద్దిపేట జిల్లా, గోదావరి జలాలు, రైలు రాక జిల్లా కేంద్రం ప్రజల ముంగిట్లో కి వచ్చింది, నినాదాలను నిజాలుగా చేసిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు.

సిద్దిపేట జిల్లా రాకముందు ఎన్నో ప్రయాసాలు పడ్డామని, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జర్నలిస్టులు వాణిజ్య వ్యాపార ఇలా అన్నీ వర్గాల వారు ఇబ్బంది పడ్డారని.. అలాంటి సిద్దిపేటను జిల్లా చేసుకోని అద్భుతమైన ప్రగతి సాధించుకున్నామని చెప్పారు. అలాంటి సిద్దిపేట జిల్లా ఈ అక్టోబర్ 26కి పదేళ్లు అవుతున్న సందర్భంగా సిద్దిపేట ఖ్యాతిని ఎల్లలు దాటేలా నిర్వహించుందామని చెప్పారు.

ఈ సందర్బంగా వారి అభిప్రాయాలను అడిగి తెల్సుకున్నారు. సిద్దిపేట నాడు ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో భావితరాలకు తెలపాల్సిన భాద్యత మన అందరి పై ఉందన్నారు. సిద్దిపేట జిల్లా ఎన్నో ఏళ్ల కల.. ఆ కలను నిజం చేసుకోవడం ఒక వైపు... పదేళ్లలో ఎన్న దేశానికే ఆదర్శ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా వేడుకగా ఒక పండగ చేద్దామని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement