త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నా మీద ఏదో కుట్ర జ‌రుగుతుంది.. స‌భ‌లో హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు

Harish Rao | శాస‌న‌స‌భా వేదిక‌గా బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌భ‌లో నేను మాట్లాడిన ప్ర‌తిసారి ఏదో కుట్ర జరుగుతుంద‌ని హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Mar 23, 2026, 5.26 pm IST

Harish Rao | నా మీద ఏదో కుట్ర జ‌రుగుతుంది.. స‌భ‌లో హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : శాస‌న‌స‌భా వేదిక‌గా బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌భ‌లో నేను మాట్లాడిన ప్ర‌తిసారి ఏదో కుట్ర జరుగుతుంద‌ని హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు. బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ఎస్సీ సంక్షేమంపై హ‌రీశ్‌రావు మాట్లాడుతుండ‌గా.. స‌మ‌యం మించిపోయింది.. మిగ‌తా స‌భ్యులు కూడా మాట్లాడేది ఉంది.. చాలా స‌మ‌యం కేటాయిస్తున్నాం.. ముగించాల‌ని ప్యానెల్ స్పీక‌ర్ కోరారు. మైక్ క‌ట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ క్ర‌మంలో హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఇంత చ‌క్క‌గా రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన విష‌యంపై మాట్లాడుతున్నాను. నేనేవ‌ర్ని విమ‌ర్శించ‌డం లేదు. తిట్ట‌డం లేదు. స‌బ్జెక్ట్ మాట్లాడుతున్నా. వ‌న్ అవ‌ర్ స‌మ‌యం కావాలి. నేను ఎప్పుడు మాట్లాడిన మిమ్మ‌ల్ని కూర్చోబెడుతున్నారు. ఇదేదో కుట్ర‌ అయితుంది. నేను మాట్లాడిన‌ప్పుడు స్పీక‌ర్ లోప‌లికి పోతున్న‌రు.. మీరు వ‌చ్చి కూర్చుంటున్నారు. బెల్ కొడుతున్న‌రు.. ఇదేదో కుట్ర జ‌రుగుతుంది.. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ బాలు నాయ‌క్ గారూ.. ఇది త‌గ‌దు. ఇది మంచిది కాదు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఇంత‌లోనే శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు క‌ల్పించుకొని.. ప్యానెల్ స్పీక‌ర్ చైర్‌లో కూర్చున్న‌ప్పుడు వారిని కూడా స్పీక‌ర్‌గానే చూడాలి. చైర్ ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించొద్దు. డిమాండ్ల‌పై మాట్లాడితే స‌మ‌యం ఇస్తాం. స‌భా సంప్ర‌దాయాలు పాటించాలి. స‌భా స‌మ‌యాన్ని వృథా చేయొద్దు. ప్ర‌తి డిమాండ్ మీద మాట్లాడండి.. గ‌త రెండేండ్ల నుంచి ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ల‌పై మాట్లాడారు. ఇప్పుడు కూడా అవ‌కాశం ఇస్తున్నాం. ఆదివారం కూడా స‌భ పెట్టాం. అన్ని డిమాండ్ల‌పై మాట్లాడాలి. చివ‌ర‌కు ముగించాల‌ని కోరుతున్నాన‌ని హ‌రీశ్‌రావుకు శ్రీధ‌ర్ బాబు సూచించారు.

అనంత‌రం హ‌రీశ్‌రావు స్పందిస్తూ.. మంత్రి శ్రీధ‌ర్ బాబు అంటే నాకు గౌర‌వం. మొత్తం 32 డిమాండ్ల‌పై మాట్లాడాల‌నుకున్నాను. కానీ 20 తీసేసి 10 నుంచి 12 డిమాండ్ల‌పై మాట్లాడుతాను. ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడుకుందాం స్పీక‌ర్ గారు అని హ‌రీశ్‌రావు మ‌న‌వి చేయ‌గా.. ఎస్టీలంటే హ‌రీశ్‌రావుకు ఎంత ప్రేమ‌నో చూడు అని అధికార ప‌క్ష స‌భ్యులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement
Advertisement