Brahmotsavam 2026 | స్వర్ణరథంపై శ్రీవారి విహారం.. గోవింద నామస్మరణతో పులకించిన తిరుమల
Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు స్వర్ణరథోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Popular news | Published On Sep 20, 2026, 6.41 pm IST
Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు స్వర్ణరథోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వర్ణరథోత్సవం కన్నులపండువగా సాగింది. నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులు స్వామివారి దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. రథం ముందుకు కదులుతున్న సమయంలో “గోవిందా.. గోవిందా..” అంటూ భక్తులు చేసిన నామస్మరణతో తిరుమాడ వీధులు మార్మోగాయి. స్వర్ణకాంతులతో మెరిసిపోతున్న రథంపై కొలువుదీరిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అలంకారాన్ని భక్తులు కనులారా వీక్షించారు. స్వామివారి దివ్యదర్శనం లభించడంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు.

రథాన్ని లాగిన మహిళలు
స్వర్ణరథోత్సవంలో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో స్వర్ణరథం తాళ్లను పట్టుకుని రథాన్ని ముందుకు లాగారు. మహిళల గోవిందనామస్మరణ, మంగళవాయిద్యాల నడుమ స్వర్ణరథం తిరుమాడ వీధుల్లో సాగిన తీరు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారి స్వర్ణరథోత్సవానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని భక్తులు భావిస్తారు. శ్రీదేవిని సంపదకు, భూదేవిని ధాన్యసంపదకు ప్రతీకగా భావిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు స్వర్ణరథంపై విహరించడం స్వామివారి వైభవానికి ప్రతీకగా పరిగణిస్తారు. స్వర్ణరథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి కృపతో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సకల శుభాలు, ధాన్యసమృద్ధి చేకూరుతాయని భక్తుల విశ్వాసం. స్వర్ణరథోత్సవంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మతో పాటు పలువురు బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
- ●Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు...పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్
- ●Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
- ●India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?
- ●Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ - ఒక్క రోజు గ్యాప్లో మహానటి రెండు సినిమాలు రిలీజ్
- ●Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘటన రోజు కారులోనే ఆమె తల్లి

Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ

Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు...పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్

Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం

India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?





