Harish Rao | ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ
Harish Rao | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. గౌరవం లేని సభలో కేసీఆర్ చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారని, ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. గౌరవం లేని సభలో కేసీఆర్ చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారని, ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో శాసనసభాపక్ష సమావేశం ముగిసిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రేపట్నుంచి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ అధ్యక్షతన చర్చించడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. కాంగ్రెస్ పాలన వెయ్యి రోజుల సందర్భంగా ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు, దళితులకు, గిరిజనులకు, బలహీనవర్గాలకు రేవంత్ సర్కార్ తీరని ద్రోహం తలపెట్టింది. నెల రోజులు సభను నడపాలని బీఏసీ సమావేశంలో డిమాండ్ చేయాలని నిర్ణయించడం జరిగిందని హరీశ్‌రావు తెలిపారు.
22ఏపై గట్టిగా నిలదీయాలని నిర్ణయించాం.
ముఖ్యంగా కాళేశ్వరం జలాల ఎత్తిపోతల విషయంలో అవకాశం ఉన్నా కూడా కాళేశ్వరం జలాలు ఎత్తకుండా రైతాంగానికి చేస్తున్న ద్రోహంపై నిలదీయాలని కేసీఆర్ చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పనులను కేసీఆర్ 80 శాతం పూర్తి చేశారు. థర్డ్ ప్యాకేజీలో చిన్న పని పూర్తి చేసి ఉంటే 60 టీఎంసీల వరకు రిజర్వాయర్లను నింపుకునే అవకాశం ఉండేది. కానీ ఆ పనులు చేయలేదు. ఈ నిర్లక్ష్యంపై నిలదీస్తాం. నిషేధితా జాబితాలో రైతుల భూములను, ప్రజల ఆస్తులను పెట్టి ఇబ్బంది పెడుతుంది. 22ఏపై గట్టిగా నిలదీయాలని నిర్ణయించాం. కరెంట్ కోతలు, రుణమాఫీ, రైతుబంధు, జీవో 97, సింగరేణి కుంభకోణాలు, ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ, డీఏలతో పాటు ఈహెచ్ఎస్ ఫెయిల్యూర్‌పై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. 30 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో వారి చదువులు ఆగిపోతున్నాయి.. భవిష్యత్ దెబ్బతింటుంది.. ఈ అంశంపై కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు
రేవంత్ రెడ్డి.. బడ్వె, పైల్వాన్.. బట్టలిప్పి కొడతాడు, తిర్రేసి కొడతాడు అని అసెంబ్లీలో మాట్లాడటం చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది. అలాంటి గౌరవం లేని సభకు కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ చిల్లర ముఖ్యమంత్రితో చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం అందరం ఏకగ్రీవంగా నిర్ణయించాం. కేసీఆర్ తయారు చేసిన సైనికులం మేమున్నాం, మేమడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా రేవంత్ రెడ్డికి లేదు అని హరీశ్‌రావు అన్నారు.
తాజావార్తలు
- ●Harish Rao | యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి.. హరీశ్‌రావు డిమాండ్
- ●CS Sanjay Jaju | ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఎన్‌హెచ్-44, ఎస్‌హెచ్-1 ఎలివేటెడ్ కారిడార్లు
- ●BRS Auto Rally | కాంగ్రెస్ హామీలపై ఆటో ర్యాలీలు.. బీఆర్ఎస్ నిరసనల హోరు
- ●NTR Movie | ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్.. ఇద్దరు భామలతో స్పెషల్ సాంగ్‌కు ప్లాన్!
- ●US Iran Conflict | 'యుద్ధ నియమాలు మారాయి.. బదులు ఊహించని విధంగా ఉంటుంది': అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●The Paradise Movie | ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై క్లారిటీ.. ఊహాగానాలకు చెక్ పెట్టిన మూవీ టీమ్..!

Harish Rao | యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి.. హరీశ్‌రావు డిమాండ్

CS Sanjay Jaju | ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఎన్‌హెచ్-44, ఎస్‌హెచ్-1 ఎలివేటెడ్ కారిడార్లు

BRS Auto Rally | కాంగ్రెస్ హామీలపై ఆటో ర్యాలీలు.. బీఆర్ఎస్ నిరసనల హోరు

NTR Movie | ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్.. ఇద్దరు భామలతో స్పెషల్ సాంగ్‌కు ప్లాన్!





