త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chirumarthi Lingaiah | నిధులు తెస్తార‌నుకుంటే ఒంటి నిండా విషంతో వ‌చ్చిండు

Chirumarthi Lingaiah | నిన్న న‌కిరేక‌ల్‌కు వ‌చ్చిన సీఎం రేవంత్‌రెడ్డి నిధులు తెస్తార‌నుకుంటే ఒంటి నిండా విషంతో వ‌చ్చార‌ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమ‌ర్శించారు. న‌కిరేక‌ల్‌కు ఆయ‌న చేసిందేం లేద‌న్నారు. తెలంగాణ తెచ్చి బాగు చేసినందుకు కేసీఆర్ రాజీనామా చేయాలా అని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Sep 6, 2026, 3.35 pm IST

Chirumarthi Lingaiah | నిధులు తెస్తార‌నుకుంటే ఒంటి నిండా విషంతో వ‌చ్చిండు
Advertisement
  • కొవ్వు బ‌లిసి మాట్లాడుతున్న‌డు
  • గంగెద్దులోళ్లెవ‌లో న‌ల్ల‌గొండోళ్ల‌కు తెలుసు
  • సిద్దిపేట‌, సిరిసిల్ల ఎందుకు.. కొడంగ‌ల్‌లో చ‌ర్చ పెడితే మేమే వ‌స్తాం
  • తెలంగాణ బాగు చేసినందుకు కేసీఆర్ రాజీనామా చేయాలా?
  • మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య ఫైర్‌

Chirumarthi Lingaiah | త్రినేత్ర‌.న్యూస్‌: నిన్న న‌కిరేక‌ల్‌కు వ‌చ్చిన సీఎం రేవంత్‌రెడ్డి నిధులు తెస్తార‌నుకుంటే ఒంటి నిండా విషంతో వ‌చ్చార‌ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమ‌ర్శించారు. న‌కిరేక‌ల్‌కు ఆయ‌న చేసిందేం లేద‌న్నారు. తెలంగాణ తెచ్చి బాగు చేసినందుకు కేసీఆర్ రాజీనామా చేయాలా అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ నిర‌స‌న‌ల‌కు భ‌య‌ప‌డి రేవంత్ ఏదేదో మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. సిద్దిపేట‌, సిరిసిల్ల ఎందుక‌ని.. కొడంగ‌ల్‌లో చ‌ర్చ పెడితే తామే వ‌స్తామ‌ని తేల్చి చెప్పారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

నిన్న నా నియోజకవర్గానికి రేవంత్ వచ్చారు. సీఎం మొత్తం ప్రసంగం తిట్ల దండకమే. వచ్చిన జనం కూడా చీదరించుకుని వెళ్లిపోయారు. రైతులకు బీమా పథకం బంద్ పెట్టారు. రైతుబంధుకు రాం రాం అన్నారు. బీఆర్ఎస్ నిరసనలకు రేవంత్ భయపడి ఏదేదో మాట్లాడారు. సీమాంధ్ర నాయకుల మోచేతి నీళ్ళు తాగే రేవంత్ రెడ్డా కేసీఆర్ రాజీనామా గురించి అడిగేది? తెలంగాణ తెచ్చి బాగు చేసినందుకు కేసీఆర్ రాజీనామా చేయాలా?

నకిరేకల్‌లో వంద పడకల ఆస్పత్రి కేసీఆర్ ఘనతే. కొత్తగా నకిరేకల్‌కు రేవంత్ ప్రకటించింది ఏమీ లేదు. మూటలు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి నీతులు చెబుతున్నారు. కేసీఆర్ పేరెత్తే అర్హత ఉందా? ఓటుకు నోటు దొంగ, బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ భద్రత గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. రేవంత్ ముందుగా తన కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రభుత్వ సొమ్మును దుబారా చేయడం ఆపాలి.

ప్రశ్నిస్తే ఫ్రస్ట్రేషన్

నల్లగొండ ప్రాజెక్టులను పడావు పెట్టిన ఘనత రేవంత్‌ది. అక్రమ డబ్బుతో కొవ్వు బలిసి రేవంత్ మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే రేవంత్‌కు ఫ్రస్ట్రేషన్ వస్తోంది. రేవంత్ అన్నదమ్ములు, పొంగులేటి దందాలకు హద్దే లేదు. రేవంత్ కుటుంబ సభ్యులే రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు. ఎవ్వరూ సంతోషంగా లేరు. 22ఏ తో పొంగులేటి సంపాదించి పెద్ద పెద్ద టవర్లు కట్టుకుంటున్నారు.

అది రేవంత్‌కు చావు డ‌ప్పే..

రేవంత్ పొద్దున లేస్తే కేసీఆర్ చావును కోరుకుంటున్నారు. సిద్దిపేట, సిరిసిల్లలో ఏదో పొడుస్తా అంటున్నారు. ముందు కొడంగల్‌లో రేవంత్ గెలవాలి. రేవంత్ పని అయిపోయింది. కొడంగల్‌లో చర్చ పెట్టు.. మేమే వస్తాం. రేవంత్ మీటింగ్ తర్వాత నల్లగొండ కాంగ్రెస్ నేతల మొహాలు వాడిపోయాయి. నిన్న నకిరేకల్‌లో రేవంత్‌కు కొట్టింది చావు డప్పు.కేసీఆర్‌ను సీఎం చేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. రేవంత్ కేటీఆర్, హరీష్ రావు ల కాలి గోటికి కూడా సరిపోరు. రేవంత్ రెడ్డికి సామెతలు వాడటం కూడా సరిగా రాదని ప్రజలు నవ్వుకుంటున్నారు. గంగిరెద్దుల వాళ్లు ఎవరో నల్లగొండ ప్రజలకు తెలుసు అని లింగ‌య్య‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement
Advertisement