Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి
Harish Rao | ఈ వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని, ఇందుకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డే తన పదవికి రాజీనామా చేయాలని ప్రజల్లో నుంచి డిమాండ్ వస్తుందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఈ వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని, ఇందుకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డే తన పదవికి రాజీనామా చేయాలని ప్రజల్లో నుంచి డిమాండ్ వస్తుందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో శాసనసభాపక్ష సమావేశం ముగిసిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రాజీనామా చేయాలని ప్రజల్లోనుంచి డిమాండ్ వస్తుంది. నిరుద్యోగ యువతను మోసం చేసినందుకు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రాజీనామా చేయాలని డిమాండ్ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయనందుకు, బీసీ, మైనార్టీ డిక్లరేషన్‌లను మూడేండ్ల పాటు దగా చేసినందుకు రాజీనామా చేయాలని డిమాండ్ వస్తుంది. రుణమాఫీ ఎగ్గొట్టారు. ఎరువులు దొరక్క రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.. తిరగబడుతున్నారు. కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్‌పై అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ప్రజలను మోసం చేసిన నాయకుడివి నువ్వు
ప్రజలను మోసం చేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి. కేసీఆర్ గురించి మాట్లాడే నైతికత మీకు లేదు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, కేసీఆర్ కిట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. నాడు ప్రజల కేంద్రంగా కేసీఆర్ ఆలోచించారు. ఎన్నికల ముందు ఆపద మొక్కులు మొక్కి ప్రజలను మోసం చేసిన నాయకుడివి నువ్వు. అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయి పిల్ల చేష్టలు చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం కేసీఆర్ సైనికులం.. మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రజల ఇబ్బందులపై ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరే సమాధానం చెప్పలేక అడ్డగోలుగా మాట్లాడతున్నారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
తాజావార్తలు
- ●Harish Rao | ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ
- ●Kusukuntla Prabhakar Reddy | రాజగోపాల్ రెడ్డి గోల్మాల్ గోపాల్‌గా మారిండు
- ●Harish Rao | యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి.. హరీశ్‌రావు డిమాండ్
- ●CS Sanjay Jaju | ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఎన్‌హెచ్-44, ఎస్‌హెచ్-1 ఎలివేటెడ్ కారిడార్లు
- ●BRS Auto Rally | కాంగ్రెస్ హామీలపై ఆటో ర్యాలీలు.. బీఆర్ఎస్ నిరసనల హోరు
- ●NTR Movie | ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్.. ఇద్దరు భామలతో స్పెషల్ సాంగ్‌కు ప్లాన్!

Harish Rao | ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ

Kusukuntla Prabhakar Reddy | రాజగోపాల్ రెడ్డి గోల్మాల్ గోపాల్‌గా మారిండు

Harish Rao | యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి.. హరీశ్‌రావు డిమాండ్

CS Sanjay Jaju | ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఎన్‌హెచ్-44, ఎస్‌హెచ్-1 ఎలివేటెడ్ కారిడార్లు





