త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kusukuntla Prabhakar Reddy | రాజగోపాల్ రెడ్డి గోల్‌మాల్ గోపాల్‌గా మారిండు

Kusukuntla Prabhakar Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి గోల్‌మాల్ గోపాల్‌గా మారార‌ని.. మొన్నటి దాకా సీఎంపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మంత్రి పదవి కోసం కాళ్లు పట్టుకుని సైలెంట‌య్యారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఆరోపించారు.

S

Telangana | Published On Sep 6, 2026, 6.12 pm IST

Kusukuntla Prabhakar Reddy | రాజగోపాల్ రెడ్డి గోల్‌మాల్ గోపాల్‌గా మారిండు
Advertisement
  • మొన్న‌టి దాకా రేవంత్‌పై పెద్ద‌గ మాట్లాడి మంత్రి ప‌ద‌వి కోసం సైలెంటైండు
  • ఆయ‌న రియ‌ల్ ఎమ్మెల్యే కాదు.. రీల్స్ ఎమ్మెల్యే
  • ఎమ్మెల్యేగా సరిగా పని చేయనోడు మంత్రిగా పనికొస్త‌డా?
  • కేసీఆర్‌ రాజీనామా కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వమే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి
  • మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల‌ ప్ర‌భాక‌ర్‌రెడ్డి డిమాండ్‌

Kusukuntla Prabhakar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి గోల్‌మాల్ గోపాల్‌గా మారార‌ని.. మొన్నటి దాకా సీఎంపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మంత్రి పదవి కోసం కాళ్లు పట్టుకుని సైలెంట‌య్యారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఆరోపించారు. ఆయ‌న రియ‌ల్ ఎమ్మెల్యే కాద‌ని.. రీల్స్ ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. అబ‌ద్దాల్లో అవార్డులుంటే అది ఆయ‌న‌కే ఇవ్వాల‌న్నారు. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఉత్త‌ర కుమారుడిలా మారొద్ద‌న్నారు. కేసీఆర్ రాజీనామాను అడ‌గ‌డం కాద‌ని.. మొత్తం కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆదివారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి, ఉత్త‌మ్‌పై సెటైర్లతో విరుచుకుప‌డ్డారు.

కేసీఆర్ రాజీనామా చేస్తే తెలంగాణ కన్నీళ్లు కారుస్త‌ది..

చంద్రబాబును సంతోషపెట్టడానికే రేవంత్ రోజూ కేసీఆర్‌పై తిట్ల పురాణం అందుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వంలో 75 శాతం సలహాదారులు చంద్రబాబు పెట్టినవారే ఉన్నారు. .రేవంత్ హాయాంలో తెలంగాణకు నీళ్లు లేవు, నిధులు లేవు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రతిపక్ష నేతను రాజీనామా కోరడం హాస్యాస్పదం. కేసీఆర్ రాజీనామా చేస్తే తెలంగాణ అంతా కన్నీళ్లు పెడుతుంది.

రేవంత్ దిగిపోతే ప్ర‌జ‌ల‌కు పండ‌గే..

రేవంత్ తెలంగాణకు శనిలా పట్టారు. రేవంత్ రాజీనామా చేస్తే తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటారు. రేవంత్ లాగా ప్రజల నుంచి ఇన్ని తిట్లు తిన్న సీఎం ఎవ్వరూ లేరు. సీఎం పదవి అందరికీ రాదు. వచ్చిన పదవిని రేవంత్ దుర్వినియోగం చేస్తున్నారు.

ఒంటె పెదవులకు నక్క ఆశ పడ్డట్టు ఉంది సీఎం, మంత్రుల తీరు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరు అత్యంత అధ్వాన్నంగా ఉంది. నల్లగొండ జిల్లాకు ఏం కావాలో ఉత్తమ్‌కు అవగాహన లేదు. డీండీ ద్వారా దేవరకొండకు, మునుగోడుకు నీళ్లు ఇవ్వాలని లేదు. నల్లగొండ ఎడారిలా మారే ప్రమాదం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడిలా మారొద్దు. డీండీ నుంచి నీళ్లు ఇవ్వకపోతే ఉత్తమ్‌ను అడ్డుకుంటామ్.

మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గోల్‌మాల్ గోపాల్ గా మారారు. చెప్పేది ఎక్కువ.. చేసేది తక్కువ. మంత్రి పదవి కోసం రాజగోపాల్ సీఎం కాళ్లు పట్టుకుని సైలెంట్ అయ్యారు. అబద్దాల పునాదుల మీద రాజగోపాల్ గెలిచాడు. రోడ్ల కోసం 2 వేల కోట్లు ఇచ్చారని అబద్దాలు చెబుతున్నారు. అబద్దాల్లో రాజగోపాల్‌కే అవార్డు ఇవ్వాలి. ప్రజలు ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాం. కేసీఆర్ కాలి గోటికి సరిపోనివారు కూడా ఆయన రాజీనామాను అడుగుతున్నారు.
ఇకనైనా రేవంత్ రెడ్డి నోరును అదుపులో పెట్టుకోవాలి అని ప్ర‌భాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement