త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errabelli Dayakar Rao | కో ఆప్షన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి

Errabelli Dayakar Rao | మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల( Co Option Members ) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు( Errabelli Dayakar Rao ) డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Oct 8, 2026, 4.47 pm IST

Errabelli Dayakar Rao | కో ఆప్షన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
Advertisement

బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నారనే భయంతోనే ఎన్నికలు వాయిదా
కేసీఆర్ భూకబ్జాలంటూ కొత్త నాటకానికి తెరలేపుతున్నారు
రేవంత్ బ్ర‌ద‌ర్స్‌కు వందల కోట్ల ఆస్తులు ఎక్కడివి?
నిల‌దీసిన మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

Errabelli Dayakar Rao | త్రినేత్ర న్యూస్ : మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల( Co Option Members ) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు( Errabelli Dayakar Rao ) డిమాండ్ చేశారు. బీఆర్ఎస్( BRS ) కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కో ఆప్షన్ ఎన్నికలను నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. గురువారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికై ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రతి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందున కో ఆప్షన్ పదవులు బీఆర్‌ఎస్‌కు దక్కుతాయనే భయంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తోందని విమర్శించారు. తొర్రూరు మున్సిపాలిటీలోనూ బీఆర్‌ఎస్‌కు చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉందనే కారణంతోనే ఎన్నికల ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లకు వారి హక్కులు కల్పించాలని, కో ఆప్షన్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఎర్రబెల్లి ఆరోపించారు. కేసీఆర్‌పై భూకబ్జాల ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపుతోందని విమర్శించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన అన్నదమ్ములకు వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు పసుమర్తి సీతారాములు, మంగళపల్లి శ్రీనివాస్, రామిని శ్రీనివాస్, నల్లమాస ప్రమోద్ కుమార్, హనుమండ్ల ప్రదీప్ రెడ్డి, కుర్ర శ్రీనివాస్, మనిరాజు, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు భూసాని జయమ్మ, ధరావత్ పద్మ, కిన్నెర కవిత, తూర్పటి రవి, జంపా, మాడుగుల భవానీలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement