త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nadendla Bhaskara Rao | నాన్న ‘నాదెండ్ల’ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆ వార్త‌లు అవాస్త‌వం

Nadendla Bhaskara Rao | ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు ఆరోగ్యం విష‌మించింద‌ని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని ఆయ‌న కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

S

Telangana | Published On Apr 11, 2026, 6.19 pm IST

Nadendla Bhaskara Rao | నాన్న ‘నాదెండ్ల’ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆ వార్త‌లు అవాస్త‌వం
Advertisement

Nadendla Bhaskara Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు ఆరోగ్యం విష‌మించింద‌ని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని ఆయ‌న కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. భాస్క‌ర్ రావు ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు.. ప్ర‌స్తుతం ఆయ‌న ఆస్ప‌త్రిలో చేర‌లేద‌ని తెలిపింది. ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేయొద్ద‌ని మీడియా సంస్థ‌ల‌ను, సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌ను కోరింది.

నాదెండ్ల భాస్క‌ర్ రావు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, ఐసీయూలో చికిత్స పొందుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. మ‌ల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావ‌డంతో గ‌త ప‌ది రోజుల నుంచి కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం చేశారు. ఈ వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ రావు కార్యాల‌యం ప్ర‌క‌ట‌న‌తో తేలిపోయింది.

Advertisement
Advertisement