త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Evening B Tech Courses | పాలిటెక్నిక్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. 12 కాలేజీల్లో సాయంత్రం బీటెక్ కోర్సులు

Evening B Tech Courses | మీరు పాలిటెక్నిక్( Polytechnic ) పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారా..? బీటెక్( B Tech )కూడా చేయాల‌ని ఉందా..? అయితే మీలాంటి వారి కోస‌మే సాయంత్రం బీటెక్ కోర్సుల‌కు( Evening B Tech Courses ) తెలంగాణ ప్ర‌భుత్వం( Telangana Govt ) ప‌చ్చ‌జెండా ఊపింది. వివ‌రాలివే..

S

Telangana | Published On Mar 10, 2026, 6.56 am IST

Evening B Tech Courses | పాలిటెక్నిక్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. 12 కాలేజీల్లో సాయంత్రం బీటెక్ కోర్సులు
Advertisement

Evening B Tech Courses | త్రినేత్ర‌.న్యూస్ : పాలిటెక్నిక్( Polytechnic ) చేసి ఉద్యోగం చేస్తున్న అభ్య‌ర్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఉద్యోగంలో నిమ‌గ్న‌మ‌వుతున్న అభ్య‌ర్థులు.. ఇక నుంచి త‌మ ఉన్న‌త విద్య‌ను కొన‌సాగించుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. రాష్ట్రంలోని 12 ఇంజినీరింగ్ కాలేజీల్లో సాయంత్రం బీటెక్ కోర్సుల‌కు( Evening B Tech Courses ) అనుమ‌తి ఇచ్చింది. ఎన్నో నెల‌లుగా ఈ ఫైల్ ప్ర‌భుత్వం వ‌ద్ద పెండింగ్‌లో ఉండ‌గా.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో విద్యాశాఖ జీవో 30ని జారీ చేసింది.

ఒక్కో కోర్సుకు 15 నుంచి 60 సీట్లు

మొత్తం 12 కాలేజీల్లో ఒక్కో కాలేజీకి ఒక‌ట్నుంచి ఐదు కోర్సుల‌కు అనుమ‌తి ల‌భించింది. ఒక్కో కోర్సులో క‌నిష్ఠంగా 15 నుంచి గ‌రిష్ఠంగా 60 సీట్ల వ‌ర‌కు ఉన్నాయి. ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే ప్ర‌వేశాలు నిర్వ‌హించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది ప్ర‌భుత్వం. అయితే ఈ 12 కాలేజీలు క‌లిసి ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించుకుని ఆయా కోర్సుల్లో ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థుల‌ను చేర్చుకోవ‌చ్చు.

మ‌రి అర్హ‌త‌లు ఏంటి..?

పాలిటెక్నిక్‌ పూర్తి చేసి.. కనీసం ఏడాది పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు బీటెక్‌ కోర్సులో చేరొచ్చు. బీటెక్‌ చేసిన వారు ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. సాయంత్రం వేళ తరగతులు ఉంటాయి. రెగ్యులర్‌ కోర్సులకు ఉన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అనుమతి పొందిన కాలేజీలు ఇవే..

1.సీబీఐటీ
2.వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి
3.ఎంవీఎస్‌ఆర్‌
4.స్టాన్లీ
5.మెథడిస్ట్‌
6.ఎంజీఐటీ
7.మాతృశ్రీ
8.అబ్దుల్‌ కలాం
9.జయప్రకాశ్‌ నారాయణ్‌(మహబూబ్‌నగర్‌)
10.అనుబోస్‌(పాల్వంచ)
11.సిద్ధార్థ
12.సెయింట్‌ పీటర్స్‌

Advertisement
Advertisement