త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌.. రూ.రూ.74,990కే ఫోన్‌..!

iPhone 17 Pro Max | ఆపిల్‌ ఐఫోన్‌ ప్రియులకు ప్రముఖ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌ క్రోమా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ ఆఫర్‌ను ప్ర‌క‌టించింది. ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ 256జీబీ మోడల్‌ను రూ.74,990 ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది. 512జీబీ వేరియంట్‌ రూ.94,990 వరకు తగ్గే అవకాశం ఉంద‌ని తెలిపింది.

P

Business | Published On Sep 13, 2026, 3.24 pm IST

iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌.. రూ.రూ.74,990కే ఫోన్‌..!
Advertisement

iPhone 17 Pro Max | ఆపిల్‌ ఐఫోన్‌ ప్రియులకు ప్రముఖ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌ క్రోమా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ ఆఫర్‌ను ప్ర‌క‌టించింది. ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ 256జీబీ మోడల్‌ను రూ.74,990 ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది. 512జీబీ వేరియంట్‌ రూ.94,990 వరకు తగ్గే అవకాశం ఉంద‌ని తెలిపింది. ఎక్స్ఛేంజ్‌ బోనస్, పాత ఫోన్‌ విలువ, బ్యాంక్‌ క్యాష్‌బ్యాక్‌ను బ‌ట్టి ఫోన్ ధ‌ర ఆధార‌ప‌డి ఉంటుంద‌ని తెలిపింది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసే అవకాశం క్రోమా కల్పిస్తోంది. దీనిపై గరిష్టంగా రూ.12వేల వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ పొందొచ్చు. దీనికి అదనంగా పాత ఫోన్‌ విలువ కూడా లభిస్తుంది. ఉదాహరణకు ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌కు గరిష్టంగా రూ.53వేల‌ వరకు ఎక్స్ఛేంజ్‌ విలువ లభించే అవకాశం ఉంది. అయితే, పాత ఫోన్‌ మోడల్, దాని కండిషన్‌ను బట్టి ఈ విలువ మారుతుంది. ఫోన్‌ పరిస్థితి ఎంత మెరుగ్గా ఉంటే అంత ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

బ్యాంక్‌ కార్డుతో మరో రూ.4 వేల క్యాష్‌బ్యాక్‌

ఎంచుకున్న క్రెడిట్‌ కార్డులతో చెల్లింపులు చేసే కస్టమర్లకు గరిష్టంగా రూ.4వేల‌ వరకు బ్యాంక్‌ క్యాష్‌బ్యాక్‌ కూడా అందుబాటులో ఉంది. అంటే ఎక్స్ఛేంజ్‌ ప్రయోజనంతో పాటు బ్యాంక్‌ ఆఫర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. అయితే, ఈ క్యాష్‌బ్యాక్‌ సంబంధిత బ్యాంక్‌ కార్డు, ఆఫర్ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ కొనుగోలుపై మరో ప్రయోజనాన్ని కూడా క్రోమా అందిస్తోంది. రూ.3,499 విలువైన హైఫ‌న్ కేస్ కాంబోను ఉచితంగా ఇస్తోంది. ఐఫోన్‌ 17 ప్రో సిరీస్‌తో ఆపిల్ కేర్ ప్ల‌స్‌పై 10 శాతం డిస్కౌంట్‌ కూడా ల‌భిస్తోంది. ఆరు నెలల నో-కాస్ట్‌ ఈఎంఐను ఎంచుకునే వారికి అదనంగా రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం ఇస్తోంది.

ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌ ప్రీ-బుకింగ్స్‌ షురూ

మరోవైపు ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ప్రీ-బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. క్రోమా స్టోర్లలో కొత్త ఐఫోన్‌ 18 ప్రోను రూ.5వేలు చెల్లించి ప్రీ-బుక్‌ చేసుకోవచ్చు. క్రోమా, టాటాన్యూ, బిగ్‌బాస్కెట్‌లో మాత్రం పూర్తి మొత్తాన్ని చెల్లించి ప్రీ-బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌పై కూడా గరిష్టంగా రూ.12వేల‌ వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్‌ విలువ, బ్యాంక్‌ క్యాష్‌బ్యాక్, ఇతర డిస్కౌంట్లు కస్టమర్‌ అర్హత, ఫోన్‌ మోడల్, పాత ఫోన్‌ కండిషన్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement