Rashmika Mandanna | ఆనంద్ దేవరకొండ ఎపిక్‌కు రష్మిక మందన్న రివ్యూ – కన్నీళ్లు పెట్టుకున్నా విజయ్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఎపిక్ మూవీపై రష్మిక మందన్న ప్రశంసలు కురిపించింది. భర్త విజయ్ దేవరకొండతో కలిసి శనివారం హైదరాబాద్‌లో ఎపిక్ మూవీని ప్రత్యేకంగా వీక్షించింది రష్మిక మందన్న. హార్ట్ టచింగ్ మూవీ అంటూ పోస్ట్ పెట్టింది.
Entertainment | Published On Sep 13, 2026, 3.31 pm IST
Rashmika Mandanna |ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఎపిక్ మూవీ పై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రశంసలు కురిపించింది. స్త్రీపురుషుల మధ్య ఉండే అనుబంధాన్ని అర్థవంతంగా సినిమాలో చూపించారని అన్నది. ఎపిక్ మూవీకి ఆదిత్య హసన్ దర్వకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శుక్రవారం ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
భర్తతో కలిసి...
ఎపిక్ సినిమాను శనివారం హైదరాబాద్‌లో భర్త విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్న వీక్షించింది. ఈ సినిమాను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. "యువతరంతో పాటు తల్లిదండ్రులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు సినిమాలో ఉన్నాయి. స్త్రీ పురుషుల బంధాన్ని అర్థవంతంగా, అత్యంత సహజంగా చూపించారు. ఉన్నత విద్య కోసం తమ పిల్లలను విదేశాలకు పంపే తల్లిదండ్రుల్లో ఉండే బాధ, సంఘర్షణను హార్ట్ టచింగ్‌గా దర్శకుడు సినిమాలో ఆవిష్కరించారు. ఆనంద్, వైష్ణవి నటన అద్భుతంగా ఉంది" అంటూ రష్మిక పోస్ట్‌లో పేర్కొన్నది.
ఎమోషనల్ అయ్యా
విజయ్ దేవరకొండ కూడా ఎపిక్ సినిమాపై రియాక్ట్ అయ్యాడు. "యువత కలలను, బాధ్యతల్ని, భయాలను డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరపై అందంగా, ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. సినిమాలో తండ్రీ కొడుకు మధ్య వచ్చే ఫోన్ కాల్ సీన్ చూసినప్పుడు నేను ఎమోషనల్ అయ్యాను. కన్నీళ్లు పెట్టుకున్నా" అంటూ పోస్ట్ పెట్టారు.
90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్‌సిరీస్‌లోని ఆదిత్య పాత్రను స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు ఆదిత్య హసన్ ఎపిక్‌ను తెరకెక్కించారు. రెండు రోజుల్లో ఈ సినిమా నాలుగు కోట్ల ముప్పై లక్షలకుపైగా కలెక్షన్స్ దక్కించుకుంది బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన సెకండ్ మూవీ ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | ఎంఎస్‌సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక స్పెషల్ ట్రైనింగ్ – బయోపిక్ లాంఛ్ ఎప్పుడంటే?
సెప్టెంబర్ 12, 2026

Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
సెప్టెంబర్ 9, 2026

Vijay Deverakonda | రణబాలి టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు
- ●CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్
- ●RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?
- ●TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!
- ●iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!
- ●Pawan Kalyan Keralam Visit | 'థాంక్యూ కేరళం': ఆయుర్వేద చికిత్స ముగిశాక పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. కేరళ సీఎం ఏమన్నారంటే?

NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు

CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్

RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?

TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!



