EV Vehicles | ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాలు.. క్లీన్ అండ్ గ్రీన్‌కు అడుగులు: పొన్నం
EV Vehicles | పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈవీ వాహనాల(EV vehicles) ను ప్రోత్సహిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. దాదాపు వెయ్యి కోట్లు నష్టపోయినా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి మంగళవారం సచివాలయం ముందు ఈవీ వాహనాలను ఆయన పరిశీలించారు.
త్రినేత్ర.న్యూస్: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈవీ వాహనాల(EV vehicles) ను ప్రోత్సహిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. దాదాపు వెయ్యి కోట్లు నష్టపోయినా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల (Govt employees) కు ఈవీ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా సెక్రటేరియట్ (Secretariat) ముందు ఆ వాహనాలను సీఎస్ రామకృష్ణ రావు (CS Ramakrishna Rao) , డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy), రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక, ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇప్పటికే ఈ పాలసీపై ఆర్థిక మంత్రి శాసన మండలిలో ప్రకటించారన్నారు. సీఎస్ వాహనం కొనుగోలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఢిల్లీలా మారొద్దని..
ఢిల్లీలా హైదరాబాద్ కాలుష్యకారకంగా మారొద్దనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ఈవీ పాలసీని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈవీ పాలసీతో జీరో రోడ్ టాక్స్, జీరో రిజిస్ట్రేషన్ టాక్స్ మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఈ పాలసీ వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగిందన్నారు. రవాణా శాఖ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహం ఇవ్వాలని తయారీ దారులను కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ సంస్థలకు, హైర్ లేదా డిపార్ట్మెంట్ లు కొనుగోలు చేస్తే ఈవీ వాహనాలు కొనుగోలు చేయాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
10-20 శాతం డిస్కౌంట్..
కంపెనీ దారులు ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం వారు డిస్కౌంట్ ఇస్తారని వెల్లడించారు. మహేంద్ర ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలాతో పాలు పలు కంపెనీలు ముందుకురావడం సంతోషకరమన్నారు. క్యూర్ ఏరియాలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, డీజిల్ ఆటోలు కూడా రిటైరోఫిట్ గా మార్చి నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రెడ్కో ద్వారా కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సిఎస్ రామకృష్ణ రావు, ఉద్యోగ సంఘాల నాయకులు ఈవీ వాహనాలను బుక్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో నిన్న వాహన్ పోర్టల్ లోకి చేరామని.. వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఉద్యోగులే వారధులు: సీఎస్ రామకృష్ణా రావు
నగరాన్ని కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో ఈవీ వాహనాలను ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. 2 వేల కిలోమీటర్ల మేరకు క్యూర్ చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పం తో ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. నగరంలో ఈవీ బస్సులను ఇతర వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. పెద్ద పెద్ద పట్టణాల్లో గాలి నాణ్యత తగ్గి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపడం ఆందోళనగా ఉందన్నారు. రాష్ట్రంలో 30 శాతం జనాభా హైదరాబాద్ లోనే నివసిస్తుందని.. ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలంటే ఈవీ వాహనాలు ఉపయోగించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు వారికి ఇస్తున్న ఇంటెన్సివ్ వినియోగించుకోవాలని సూచించారు. కంపెనీలకు అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
- ●TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్
- ●Minister Uttam | ప్రతి చుక్కకూ లెక్కుండాలి
- ●MoRTH | గ్రీన్ వాహన యజమానులకు గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్లు పెరగనున్న లైఫ్..
- ●CM Revanth Reddy | కులవృత్తులను కొనసాగించండి.. సీఎం రేవంత్ పిలుపు
- ●Chiranjeevi | ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ - 71 ఏళ్ల వయసులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్
- ●Mahesh Kumar | సీఎం రేవంత్‌రెడ్డి కాదు.. రేవంత్ గౌడ్.. ఆయన మాకు సోదరుడి లాంటివారు

TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్

Minister Uttam | ప్రతి చుక్కకూ లెక్కుండాలి

MoRTH | గ్రీన్ వాహన యజమానులకు గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్లు పెరగనున్న లైఫ్..

CM Revanth Reddy | కులవృత్తులను కొనసాగించండి.. సీఎం రేవంత్ పిలుపు






