త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponguleti | నెలాఖరులోగా 22-ఏ సమస్యను పరిష్కరిస్తాం

Minister Ponguleti | 22-ఏ నిషేధిత జాబితాలో అధికారుల పొరపాటుతోనే రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తాయని.. ఇప్పటికే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని.. నెలాఖరులోగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. 22-ఏ జాబితా కారణంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

P

Telangana | Published On Aug 18, 2026, 7.35 pm IST

Minister Ponguleti | నెలాఖరులోగా 22-ఏ సమస్యను పరిష్కరిస్తాం
Advertisement
  • అధికారుల పొరపాటుతోనే ఇబ్బందులు..
  • ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు
  • గ్రేటర్‌లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పరిశీలిస్తా
  • హరీశ్‌రావు కమిషన్ల గురించి మర్చిపోవడం లేదు..
  • కాలేశ్వరం కూలితే బాధ్యత ఎందుకు తీసుకోలేదు?
  • మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి

Minister Ponguleti | 22-ఏ నిషేధిత జాబితాలో అధికారుల పొరపాటుతోనే రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తాయని.. ఇప్పటికే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని.. నెలాఖరులోగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. 22-ఏ జాబితా కారణంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే 22-ఏ జాబితాలోనూ ఐదుకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని మంత్రి తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను బుధవారం స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలిస్తానని చెప్పారు.

కాలేశ్వరంపై హరీశ్‌రావుకు ప్రశ్న

మాజీ మంత్రి హరీశ్‌రావుపై పొంగులేటి తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా 30 శాతం కమిషన్ల విషయాన్ని హరీశ్‌రావు మర్చిపోవడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే దానికి హరీశ్‌రావు ఎందుకు బాధ్యత తీసుకోలేదని ప్రశ్నించారు. తాను బాధ్యతలో ఉన్నందున సమస్యలకు బాధ్యత తీసుకుని పరిష్కరిస్తున్నానని అన్నారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శలపైనా మంత్రి స్పందించారు. ఆయన ‘‘తాటాకు చప్పుళ్లకు’’ తాను భయపడబోనని స్పష్టం చేశారు. మహేశ్వర్‌రెడ్డి వద్ద ఏదైనా ఆధారం ఉంటే బయటపెట్టాలని సవాల్‌ చేశారు. ఫీనిక్స్‌, రాఘవ సంస్థల మధ్య అనేక వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయని మంత్రి పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 20 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉన్నారని చెప్పారు. అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా కొనసాగుతున్నారని.. ‘‘లబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లకు ఎదగలేదు’’ అని వ్యాఖ్యానించారు.

ప్రజలు ఆందోళన చెందొద్దు

22-ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పొంగులేటి మరోసారి స్పష్టం చేశారు. అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ సమస్యను సమగ్రంగా పరిశీలిస్తోందని.. నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement